***_రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే రైతుల తలరాత కూడా మారిపోయింది_**
*_రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే రైతుల తలరాత కూడా మారిపోయింది_*
*_సన్మానాలు, సత్కారాలు అందుకున్న చోటే లాఠీ దెబ్బలు_*
*_13వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళనలు_*
*_అమరావతే రాజధాని అని ప్రకటించే వరకూ నిరసనలు ఆగవు_*
*_రాజధాని రైతులకు తెదేపా పూర్తి మద్దతు ఉంటుంది_*
*_నందిగామ :- రాజధాని తరలింపును నిరసిస్తూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్న రైతులను అణచివేసేందుకు ప్రభుత్వం భారీసంఖ్యలో పోలీసులను మోహరించి కక్ష పూరిత చర్యలకు పాల్పడుతుందని నందిగామ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. రైతుల ఉద్యమాన్ని నీరుకార్చేందుకే పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సౌమ్య తెలిపారు. ఉచితంగా భూమి ఇచ్చిన తమకు మంచి బహుమానమే ఇచ్చారని, దాతృత్వం చూపినవారిని కటకటాల పాలుజేసిన ఘనత జగన్మోహన్‌రెడ్డి సర్కారుకే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే రైతుల తలరాత కూడా మారిపోయిందని, సన్మానాలు, సత్కారాలు అందుకున్న చోటే లాఠీ దెబ్బలు మిగిలాయని విచారం వ్యక్తం చేసారు. రాజధాని రైతుల ఆందోళనలు 14వ రోజుకు చేరాయని, అమరావతే రాజధాని అని ప్రకటించే వరకూ నిరసనలు ఆగవని, రైతులు కన్నీటి పర్యంతమౌతున్న తరుణంగా నూతన సంవత్సర వేడకలకు కూడా తెదేపా దూరంగా ఉంటానని, రాజధాని రైతులకు తెదేపా పూర్తి మద్దతు ఉంటుందని ఆమో స్పష్టం చేసారు._*
Comments
Post a Comment