**ముషారఫ్ శవం దొరికితే .... !!**

ముషారఫ్ శవం దొరికితే .... !!


పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కి ఆ దేశ న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద హాట్ టాపిక్ అయింది. 2007వ సంవత్సరంలో ఆ దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసే విధంగా పర్వేజ్ ముషారఫ్ ప్రయత్నం చేయడంతో పాటుగా అనేక ఆర్థిక నేరాలు మరియు అవినీతి చేసినట్టు అనేక ఆరోపణలు రావడంతో పాకిస్తాన్ దేశ న్యాయస్థానం విచారణ చేపట్టారు. అదే సమయంలో ముషారఫ్ తన అనారోగ్యం కారణంగా దుబాయ్ మరియు ఇంగ్లాండ్ దేశాలకు వెళుతూ చెకప్ చేయించుకుంటూ ఆ దేశాలలో ఉన్న హాస్పిటల్లో విశ్రాంతి తీసుకుంటూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో ముషారఫ్ విచారణకు హాజరుకావాలని వాంగ్మూలం ఇవ్వాలని కోర్టు కోరడంతో హాస్పిటల్ నుండి వీడియో రూపంలో తాను పాకిస్తాన్ దేశానికి రావడం కష్టమని తన ఆరోగ్యం సహకరించడం లేదని వీడియో రూపంలో కోర్టుకి తెలపడం జరిగింది.ప్రస్తుతం తాను మరణకరమైన స్థితిలో ఉన్నట్లు పర్వేజ్ ముషారఫ్ ఆ వీడియోలో పేర్కొనటం జరిగింది. దీంతో పాకిస్తాన్ న్యాయస్థానం పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాఖ్యలు విని ఒకవేళ ముషారఫ్ ఉరిశిక్షకు ముందే చనిపోయిన శవాన్ని తీసుకు వచ్చి ఉరిశిక్ష విధించాలని సంచలన తీర్పు ఇవ్వడం ఇప్పుడు అంతర్జాతీయంగా హైలైట్ అయింది. 'నిందితుడిపై ఆరోపణల ప్రకారం ముషారఫ్‌ దోషి. దోషిని చనిపోయే వరకు ఉరితీయాలి. పరారీలో ఉన్న దోషిని పట్టుకుని తీసుకురావాల్సిందే.
ఒకవేళ దోషి శవం దొరికితే, దాన్ని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్‌కు ఈడ్చుకొచ్చి మూడు రోజుల పాటు ఆ శవాన్నే ఉరితీయాలి' అని కోర్టు తీర్పులో పేర్కొన్నారు. దీంతో ఈ వార్త విని సోషల్ మీడియాలో చాలా మంది చాలా భయంకరమైన శిక్ష అని కొంతమంది ఆందోళన చెందగా మరి కొంతమంది ఇలాంటి శిక్ష శత్రువుకి కూడా రాకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్