**రాజధాని రైతులపై బాబుకు ఉండే కృతజ్ఞత కన్నా వైసీపీ ఎమ్మెల్యేలు మరింత చూపాలి: సబ్బం హరి**

రాజధాని రైతులపై బాబుకు ఉండే కృతజ్ఞత కన్నా వైసీపీ ఎమ్మెల్యేలు మరింత చూపాలి: సబ్బం హరి



రైతులపై కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు కృతజ్ఞత చూపాలి



అలా చేస్తే ఆ రైతుల త్యాగానికి సార్థకత ఉంటుంది
సీఎం జగన్ దయచేసి విజ్ఞతో ఆలోచించాలి


 


రాజధాని అమరావతి ప్రాంతానికి ఇంత చేసిన చంద్రబాబునాయుడి పార్టీకి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకుండా జగన్ కు 'ఒక్క ఛాన్స్' ఇద్దామని నమ్మి ఓట్లు వేశారని, ఆ విషయాన్ని అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం గ్రహించాలిగా అని ప్రముఖ రాజకీయవేత్త సబ్బం హరి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుపై నమ్మకంతో భూములిచ్చిన వారు తమను నమ్మి ఓట్లు వేసి.. ఎమ్మెల్యేను చేశారన్నకృతజ్ఞత వైసీపీ వాళ్లకు ఉండాలని సూచించారు. రాజధాని కోసం భూములిచ్చిన రాజధాని ప్రాంత రైతులపై చంద్రబాబు కు ఉండే కృతజ్ఞత కన్నా మరింత కృతజ్ఞతతో కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటే ఆ రైతుల త్యాగానికి సార్థకత ఉంటుందని అభిప్రాయడపడ్డారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకోవాల్సింది కేబినెట్ అని చెప్పడం అంతా 'బోగస్' అని, సీఎం జగన్ ఏది చెబితే అదే నిర్ణయం అని అన్నారు. ఈ నిర్ణయం విషయంలో జగన్ దయచేసి విజ్ఞత ఆలోచించాలని కోరారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్