**గ్రహణాలు - అపోహలు.**
*గ్రహణాలు - అపోహలు.*
వ్యవహారిక భాషలో 'గ్రహణాన్ని' చెడుకు పర్యాయపదంగా వాడటం పరిపాటి. గ్రహణం పట్టింది, గ్రహణం వీడింది అనే పదాలు మన జీవితంలో కష్టసుఖాలకి అన్వయింపబడుతుంటాయి. సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల, ఉపగ్రహాల వల్ల గ్రహణాలు ఏర్పడతాయనే విషయం అందరికి తెలిసిందే. కానీ అనాది కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలలో గ్రహణాలపై ప్రజలలో అపోహలున్నాయి. వాటిలో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయి. గ్రహణ సమయంలో వంట చేయకూడదని, తినకూడదని, ఏమీ త్రాగకూడదని, ఇలా చేస్తే చెడు ఫలితాలొస్తాయని మనదేశంలో నమ్ముతారు. అమెరికాలోని కొంతమంది గ్రహణాలు ఏర్పడటాన్ని సృష్టి వినాశనానికి సంకేతంగా భావిస్తారు. ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలలో గ్రహణం ఏర్పడమంటే సూర్యచంద్రులిద్దరూ కలిసి ఘర్షణ పడతారని నమ్ముతారు. చాలా దేశాల్లో గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలని బయటకి రావద్దని హెచ్చరిస్తారు. మరికొన్ని దేశాలలో గ్రహణాలు ఏర్పడితే భూకంపాలు వస్తాయని, తద్వారా మానవ వినాశనం జరుగుతుందని నమ్ముతారు. మన దేశంలో విస్తృతంగా ప్రచారంలో వున్న రాహు, కేతువుల కధ అందరికీ తెలిసిందే. గెలీలియో, కెప్లర్, కోపర్నికస్ వంటి ఖగోళశాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితంగా సూర్యుడు, గ్రహాల గమనంపై మనకొక అవగాహన ఏర్పడింది. చంద్రుని నీడ భూమిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజు మాత్రమే జరుగుతుంది. సూర్యగ్రహణాలలో సంపూర్ణ, పాక్షిక, వలయాకార, మిశ్రమ సూర్యగ్రహణాలుంటాయి. భూమి యొక్క నీడ చంద్రునిపై పడినపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజున మాత్రమే సంభవిస్తుంది. సూర్యగ్రహణం ఏర్పడటం వలన పగటి వేళ కొద్ది సేపు రాత్రిని తలపిస్తుంది, అంతరిక్షంపై మనిషికి అవగాహన లేని రోజుల్లో ప్రజలు గ్రహణ సమయములో భయభ్రాంతులకు గురయ్యేవారు. ఆ రోజుల్లో టోలమీ ప్రతిపాదించిన 'భూకేంద్రక సిద్ధాంతం' ప్రాచుర్యంలో ఉండేది. తర్వాత కోపర్నికస్ ప్రతిపాదించిన 'సూర్య కేంద్రక సిద్ధాంతం' శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ సిద్ధాంతాన్ని సమర్ధించినందుకు గియనార్డో బ్రూనో వంటి శాస్త్రవేత్తలను ఆనాటి మతాధిపతులు హతమార్చారు. ప్రాచీన, మధ్య యుగాల్లో చలామణిలో వున్న మూఢవిశ్వాసాలని కరపత్రాల ద్వారా కంప్యూటర్ కాలంలో కూడా ప్రచారం చేసి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రహణాలని ఎవరైనా చూడవచ్చు. గ్రహణం మొర్రికి గ్రహణాలకు ఎటువంటి సంబంధం ఉండదు. అయితే నేరుగా కంటితో గ్రహణాలు చూడకూడదు. నాణ్యమైన సోలార్ ఫిల్టర్స్ ద్వార
Comments
Post a Comment