**భారీ అగ్నప్రమాదం**
మహానగరం ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీలో శుక్రవారం అర్థరాత్రి దాటాక భారీ అగ్నప్రమాదం సంభవించింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
వారు చేపట్టిన సహాయక చర్యల్లో ఒక మహిళ, ఒక పురుషుని మృతదేహాలను వెలికితీసినట్టు సమాచారం.
ఈ సందర్భంగా అగ్నిమాపకదళ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతయ్యారని, రెండు మృతదేహాలు వెలికితీశామని, మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
Comments
Post a Comment