**మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ మానవహారం**
విజయవాడ:
మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ జిల్లాలోని బెంజ్‌సర్కిల్‌లో ఆదివారం ఉదయం మానవహారం నిర్వహించారు.
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
సేవ్ అమరావతి నినాదంతో హైస్కూల్ రోడ్డు నుంచి విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని మండిపడ్డారు.
రాజధాని అభివృద్ధి కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ చేయచ్చు కానీ, పాలనను వికేంద్రీకరణ చేయడం మంచిది కాదని తెలిపారు.
అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రకటన చేసే వరకు తమ ఉద్యమం ఆగదని, అమరావతి రాజధాని పోరాటంలో రైతులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సమితి నేతలు స్పష్టం చేశారు.
Comments
Post a Comment