Posts

Showing posts from January, 2020

**గురుకుల పాఠశాల విద్యార్తులకు మెరుగైన వైద్య చికిత్స అందించండి- నల్గొండ ఇంఛార్జి జిల్లా కలెక్టర్ వి.చంద్ర శేఖర్**

Image
నల్గొండ,జనవరి 30.జ్వరంతో జిల్లా కేంద్ర ఆసుపత్రి లో చేరిన నకిరేకల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్తులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఇంఛార్జి జిల్లా కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. జ్వరం తో బాధపడుతూ గురువారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో19 మంది విద్యార్థులు ఆసుపత్రి లో చేరి చికిత్స పొందుతున్నారు.గురువారం ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా 19 మంది విద్యార్థుల్లో 4 గురు జ్వరం,దగ్గుతో బాధపడుతున్నారని,మిగతా విద్యార్థులు సాధారణ స్థితి లో వున్నారని,వారి రక్త శాంపిల్స్ సేకరించి పరీక్ష కు పంపి రాత్రి చికిత్స అందిస్తున్నారు. విద్యార్తులు కొలుకునెలా మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఇంఛార్జి కలెక్టర్ ఆదేశించారు.విద్యా ర్థులు కు అవసరమైన రాత్రి వైద్య సేవలు అందేలా ఇద్దరు డాక్టర్ లు,ఎస్.సి.గురుకుల జిల్లా కో ఆర్డినేటర్ కుర్షిద్ ను, రీజియనల్ కో ఆర్డినేటర్ హెచ్ అరుణ కుమారి ని దగ్గరుండి పర్యవ...

**పోలీస్ శాఖ గౌరవం పెంచేలా సమజాభివృద్ధిలో బాగస్వామ్యులు కావాలి  : ఎస్పీ రంగనాధ్**

*పోలీస్ శాఖ గౌరవం పెంచేలా సమజాభివృద్ధిలో బాగస్వామ్యులు కావాలి  : ఎస్పీ రంగనాధ్* నల్గొండ : పోలీస్ శాఖ ప్రతిష్ట, గౌరవం మరింత పెరిగే విధంగా పదవీ విరమణ పొందిన తర్వాత సమజాభివృద్ది కార్యక్రమాలలో బాగస్వాములవుతూ మంచి పేరు సంపాదించుకోవాలని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు. గురువారం పోలీస్ శాఖలో పదవీ విరమణ పొందిన ఎస్.ఐ.లు ఏ.మధుసూధన్ రెడ్డి, జె. పెద్దులు, ఏ.ఎస్.ఐ. విజయపాల్ రెడ్డి, ఏ.ఆర్. ఎస్.ఐ. డి. వెంకట కిషన్ లను జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి వారి సేవలను ఎస్పీ అభినందించారు. సమాజంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తూ శాంతియుత వాతావరణంలో ప్రజలు జీవించే విధంగా సేవలందించే అవకాశం పోలీస్ ఉద్యోగం ద్వారా లభిస్తుందని, పోలీస్ ఉద్యోగం ఎంతో ఉన్నతమైనదని పదవీ విరమణ తర్వాత ప్రజలలో పోలీసుల గౌరవం పెరిగే విధంగా వారితో మమేకం కావాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదురైనా నిత్యం ప్రజల కోసం పని చేయడంలో కలిగే సంతృప్తి అలాంటి వాటన్నింటిని మర్చిపోయేలా చేస్తుందని, పోలీస్ ఉద్యోగం లభించడం గర్వకారణమని అన్నారు. *పదోన్నతి ద్వారా బాధ్యత పెరుగుతుంది* - - విధి నిర్వహణలో రాజీ ...

**రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఎల్.ఇ.డి. స్క్రీన్ తో అవగాహన కార్యక్రమాలు : ఎస్పీ రంగనాధ్**

*రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఎల్.ఇ.డి. స్క్రీన్ తో అవగాహన కార్యక్రమాలు : ఎస్పీ రంగనాధ్* - - జాతీయ రహదారుల వెంబడి ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి - - రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు - - రోడ్డు ప్రమాదాల వీడియోలు, అవగాహనా కోసం ఎల్.ఇ.డి.తో కూడిన వాహనం ద్వారా ప్రచారం నల్గొండ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్.ఇ.డి. స్క్రీన్ కలిగిన వాహనాన్ని ఆయన గురువారం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లే రహదారుల వెంట ఉన్న కంప చెట్లు, పొదలను తొలగించడం ద్వారా వాహనదారులకు సరిగా కనపడే విధంగా, రోడ్డు మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాలలో జరిగిన ప్రాణనష్టం, కుటుంబాల పరిస్థితులను అందరికి అర్ధం అయ్యే...

**స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి అజరామరం : అదనపు ఎస్పీ నర్మద**

*స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి అజరామరం : అదనపు ఎస్పీ నర్మద* - - స్వాతంత్ర సమరంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను గుర్తు చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించిన పోలీసులు నల్గొండ : దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలర్పించిన సమరయోధుల స్ఫూర్తి అజరామరమని జిల్లా అదనపు ఎస్పీ శ్రీమతి సి. నర్మద అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరయిపాలనలో అవస్థలు పడుతున్న దేశ ప్రజల బానిస సంకెళ్ల నుండి విముక్తి కల్పించడం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని విధి నిర్వహణలో మరింత సమర్ధవంతంగా పని చేస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. అనేక రకాల సమస్యలు, బాధలతో వచ్చే ప్రజలకు న్యాయం చేసే విధంగా పని చేయాలన్నారు. స్వాతంత్ర సమరంలో దేశం కోసం, దేశ ప్రజల కోసం త్యాగాలు చేసిన సమరయోధులను ప్రేరణగా తీసుకొని ప్రజలకు సేవలందించడంలో అగ్ర భాగంలో ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ వైభవ్ గైక్వాడ్, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణా రెడ్డి, డిపిఓ ఏ.ఓ. మ...

**వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్ **

అమరావతి  వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్  తన తండ్రి హత్య కేసును సిబిఐ కి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్  వేసిన వివేకా కుమార్తె సునీతమ్మ  ఇప్పటికే వివేకా హత్య కేసు సిబిఐ కి ఇవ్వాలని హైకోర్టు లో పిటిషన్లు వేసిన వైఎస్ జగన్ , వివేకా భార్య సౌభాగ్యమ్మ , ఎమ్మెల్సీ బీటెక్ రవి , మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి  కొత్తగా నాలుగో పిటిషన్ వేసిన వివేకా కుమార్తె సునీతమ్మ  విచారణ తుది దశలో ఉందని ఈ సమయంలో సిబిఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే కోర్టుకి తెలిపిన ప్రభుత్వం  నేడు ఇప్పటికే వేసిన పిటిషన్ల పై విచారణ ఉండగానే వివేకా కుమార్తె మరో పిటిషన్ అన్ని పిటిషన్లపై నేడు విచారించనున్న ధర్మాసనం ప్రతివదులుగా సీబీఐ, ఏపీ హోం శాఖను చేర్చిన పిటీషినర్ సునీత

**కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకొన్న పశ్చిమగోదావరి జిల్లా మహిళలు **

Imp breaking విజయవాడ  కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకొన్న పశ్చిమగోదావరి జిల్లా మహిళలు  తమ దీనావస్థపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన బాధిత మహిళలు  వీడియో పై స్పందించిన సీఎం కార్యాలయాలయం  సీఎంఓ ఆదేశాలతో రంగంలోకి దిగిన దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్  పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్  బాధితుల కుటుంబసభ్యుల నుంచి వివరాల సేకరణ  కువైట్ ఎంబసీతో సంప్రదింపులు  నలుగురు బాధిత మహిళలకు విముక్తి  కువైట్ నుంచి స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు చర్యలు  సీఎంఓ స్పందనపై హర్షం వ్యక్తం చేస్తున్న బాధిత మహిళల కుంబసభ్యులు

**నేటి నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు**

*నేటి నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు* .  *మోపిదేవి*   *ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆలయ కమిషనర్  జి.వి.డి.ఎన్ లీలా కుమార్*  *కృష్ణాజిల్లా*   రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి...  ప్రతి సంవత్సరం లానే జరుపుకునే వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ శనివారం వరకు నిర్వహిస్తారు...  బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ పరిసరాలు ఆలయాన్ని రంగులు ,తోరణాలు, విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతోంది..  బ్రహ్మోత్సవాల్లో భాగంగా *29వ తేదీ బుధవారం శ్రీ స్వామివారి, శ్రీ అమ్మవార్ల కళ్యాణం జరుగుతుంది..*   *30వ తేదీ గురువారం రథోత్సవం రాత్రి 8 గంటలకు జరుగుతుంది .*  బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రల వ్యాప్తంగా భక్తులు విశేషంగా హాజరవుతారని, బ్రహ్మోత్సవం నిర్వహించే రోజులు భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని సహాయ కమిషనర్ జి .వి.డి.ఎన్   లీలాకుమార్ తెలిపారు..  బ్రహ్...

**వైసిపికి షాకిచ్చిన 17మంది ఎమ్మెల్యేలు...**

వైసిపికి షాకిచ్చిన 17మంది ఎమ్మెల్యేలు... అసెంబ్లీ అధికారులపై జగన్ సీరియస్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానం పై జరిగిన అసెంబ్లీలో  ఓటింగ్ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై సీఎం జగన్ సీరియస్ అయినట్లు సమాచారం.  అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై శాసనసభలో సోమవారం ఉదయం నుండి చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఈ తీర్మానంపై ఓటింగ్ కూడా జరిగింది. అయితే ఈ తీర్మానం శాసనసభ ఆమోదాన్ని పొందినప్పటికి ఈ ఓటింగ్ ప్రక్రియలో ముఖ్యమంత్రి జగన్ కు షాకిచ్చే ఫలితం వెలువడింది.  ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అతి కీలకమైన మండలి రద్దు తీర్మానాన్ని కొందరు వైసిపి ఎమ్మెల్యేలు వ్యతిరేకించేలా వ్యవహరించారు. ఓటింగ్ సమయంలో దాదాపు 17 మంది వైసిపి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అత్యంత కీలకమైన సమయంలో ఎమ్మెల్యేలు సభలో లేకపోవడంపై సీఎం జగన్ సీరియస్ అయినట్లు సమాచారం. వారిపై చర్చలు తీసుకునే ఆలోచనలో సీఎం వున్నట్లు తెలుస్తోంది.  అయితే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో తాము ఓటింగ్ కి దూరంగా ఉన్నట్లు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మండలిలో జరిగే ...

**అంబటి రాంబాబు పాయింట్స్....**

తాడేపల్లి.... అంబటి రాంబాబు పాయింట్స్.... బీజేపీ నేత సునీల్ డియోదర్ రాజదాని అంశంపై బీజేపీతో చర్చించలేదని అంటున్నారు.. బీజేపీతో చర్చించామని మేము ఎప్పుడు చెప్పామా.. రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేదు.... మూడు రాజధానులు, హైకోర్టు ఏర్పాటుపై  బీజేపీ నేతల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.. ఎన్నికల మేనిఫెస్టోకు బీజేపీ నేతలు కట్టుబడి ఉన్నారా లేరా హైకోర్టు ను శాశ్వతంగా రాయలసీమలో ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు.. రాయలసీమ లో హైకోర్టు పెట్టడానికి  బీజేపీ నేతలు కట్టుబడి ఉన్నారా లేదా.. మీరు ఇచ్చిన హామీని మేము అమలు చేస్తుంటే ఎందుకు బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.. వికేంద్రీకరణకు అనుకూలమని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది.. అమరావతి నిర్మాణం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పింది.. రైతుల నుంచి భూముల బలవంతంగా చంద్రబాబు లాక్కున్నారని మేనిఫెస్టోలో బీజేపీ చెప్పింది.. రాజధాని ప్రాంత భూములు తిరిగి వెనక్కి ఇస్తామని బీజేపీ చెప్పింది.. బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసినా ఇంకా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.. అన్ని ప్రాంతాలు సమానంగా  అభివృద్ధి చెందాలని విప...

*_తిరువూరులో ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్.._*

*_తిరువూరులో ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్.._* *_బహిరంగ మద్యపానం నిషేధం అమలులో ఉన్నప్పటికి ఇక్కడ మాత్రం ఎలాంటి ఆదేశాలు అమలు కావడం లేదు..!_* *_ప్రభుత్వ మద్యం దుకాణాల ప్రక్కనే సిట్టింగ్ లు ఏర్పాటు చేసి మరీ సదుపాయాలు కల్పిస్తున్న పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు.._* *_ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రెస్టారెంట్ లో కూడా సిట్టింగ్ కల్పించి మద్యం ప్రియులకు అవకాశం కల్పించడంపై ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.._* *_ప్రభుత్వ మాత్రం మందుబాబులకు మద్యం దూరం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే స్థానికంగా మాత్రం ప్రభుత్వ అదేశాల్ని తుంగలో తొక్కుతున్న వైనం.._* *_ఏదైనా సమాచారాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే మాకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, డీజిల్ కూడా ఇవ్వడం లేదని  చెప్పే అధికారులు మరి వారి కార్యాలయానికి సమీపంలో రెస్టారెంట్ లలో  నిర్వహణ దేనికి సందేశం..??_* *_జిల్లా అధికారులు ఈ విషయాలపై కఠిన చర్యలు చేపడితే తప్పా..!లేకపోతే మందుబాబుల్లో ..వాటికి సహకరించే అధికారుల్లో మార్పు రాదు.._*

**ఇంటర్ విద్యార్థిని పై లైంగిక దాడి ( అత్యాచారం), ఆపై హత్య **

శ్రీకాకుళం...... వజ్రపుకొత్తూరు (మ) ధర్మ పురంలో దారుణం.  ఇంటర్ విద్యార్థిని పై లైంగిక దాడి ( అత్యాచారం), ఆపై హత్య  మృతురాలు  వజ్రపుకొత్తూరు (మ) ధర్మ పురానికి చెందిన ఈరోతు సింధు (17) గా పోలీసులు నిర్ధారించారు.  పలాస రైల్వే స్టేషన్ పరిధిలో ధర్మ పురం సమీపంలోని రైలు పట్టాలపై  విద్యార్థిని మృత దేహాన్ని కనుగొన్న రైల్వే పోలీసులు.  కాశీబుగ్గ పోలీసుల అదుపులో  నిందితుడు.  నిందితుడు  పలాస (మ) సున్నాడకు చెందిన వ్యక్తిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

**కళ్యాణ మహోత్సవానికి హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి**

Image
కళ్యాణ మహోత్సవానికి హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం లో మంగళవారం నిర్వహించిన గోదాదేవి కళ్యాణ  మహోత్సవానికి రాష్ట్ర  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ... మంత్రి నిరంజన్ రెడ్డి కి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా కళ్యాణ మహోత్సవానికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు .. కళ్యాణ మహోత్సవం లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు .. .. ఆలయంలో ముడుపు గట్టి మొక్కు చెల్లించుకుని ఆలయ అర్చకులు ఇచ్చిన తీర్థప్రసాదాలను స్వీకరించారు .‌.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గడిచిన 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దర్శించుకుం తానని, ఈ దేవాలయం మా కుటుంబానికి నమ్మకంగా నిలిచిందని పేర్కొన్నారు ... ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని ఆయన కోరారు ... రానున్న రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి మరలా దర్శించుకొంటా అని అన్నారు ... ఈ కార్యక్రమంలో లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీపీ బచుపల్లి శ్రీ దేవి గంగాధర్ రావు, జెడ్పిటిసి మాద ధనలక్ష్మీ నగేష్ గౌడ్, సర్పంచ్ ఏకుల కవిత విజయ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికా...

**మకర సంక్రాంతి**

మకర సంక్రాంతి సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు( భోగి, మకర సంక్రమణం, కనుమ) ఇతర ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్ల...

**జూబ్లీహిల్స్,లోని ఎ సీక్రెట్ ఎఫైర్ పబ్ లో రేవ్ పార్టీలో కొత్త కోణం**

జూబ్లీహిల్స్,లోని ఎ సీక్రెట్ ఎఫైర్ పబ్ లో రేవ్ పార్టీలో కొత్త కోణం పబ్ ను బుక్ చేసుకున్న సిగ్నోవా ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీ సేల్స్ పెంచుకునేందుకు డాక్టర్లకు, సేల్స్ ఉద్యోగుల కోసం రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు గుర్తించిన పోలీసులు ప్రతి ఏటా ఇలా రేవ్ పార్టీని ఈవెంట్ ఆర్గనైజర్ ప్రసాద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడి 22 మంది యువతులతో నగ్న నృత్యాలు, వ్యభిచారంకోసం తెచ్చారని గుర్తించిన పోలీసులు పట్టుబడ్డ యువతులంతా ఏపీ లోని నెల్లూరుకు చెందిన వారిగా గుర్తింపు ప్రధాన నిందితుడు ప్రసాద్ పరారీపై అనుమానాలు సినీమా ఛాన్సుల కోసం..ఈవెంట్ డ్యాన్సుల కోసం హైదరాబాద్ వచ్చి వ్యభిచార రొంపిలోకి కొందరు యువతులు

ఈ నెల 20, 21, 22 తేదీల్లో AP శాసన సభ సమావేశాలు

  ఈ నెల 20, 21, 22 తేదీల్లో AP శాసన సభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం.. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి కి సమాచారం పంపిన ప్రభుత్వం.. సీఆర్డీఏ చట్ట సవరణ సహా మరో 3 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లులను పెట్టనున్న ప్రభుత్వం.

**మందు లారీ బోల్తా**

Image
మందు లారీ బోల్తా .. పాదచారులు మందు సీసాలతో హల్ చల్. ఒంగోలు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న లిక్కర్ లారీ రోడ్డు డివైడర్ ను ఢీ కొని బోల్తా కొట్టడంతో లారీలో మందు కాస్తా రోడ్డుపాలయింది. సింగరాయకొండ వద్ద గల జివిఆర్ ఆక్వా ఎదురు హైవేపై  ముగ్గురు ప్రయాణిస్తున్న లిక్కర్ లారీ బోల్తా పడింది. వెంటనే అటుగా వెళ్తున్న పాదచారులు మరియు జీవిఆర్ ఉద్యోగులు కలసి లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న వ్యక్తుల్ని బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే పోలీసులు వచ్చేలోపు రోడ్డుపాలైన మద్యాన్ని ( ఆఫీసర్స్ ఛాయిస్ ) దొరికింది దొరికినట్లు జెబుల్లో, కవర్లలో లాగించేశారు. పోలీసుల రాకతో మద్యం సీసాలు కుప్పగా వేయించారు.

**శాంతి వయోవృద్దుల ఆశ్రమాన్ని సందర్శించిన నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి.వేణు

నల్లగొండ పట్టణంలోని గొల్లగూడలోగల శాంతి వయోవృద్దుల ఆశ్రమాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి.వేణు సందర్శించి ఆశ్రమంలొ ఉంటున్న వయోవృద్దులకు సంక్షేమ మరియు భరణం చట్టంపై అవగాహన కల్పించి, ఆశ్రమంలో ఉన్న వయోవృద్దులను వారు ఆశ్రమంలొ ఉండాల్సిన కారణాలను అడిగి తెలుసుకొని అర్హులైన వారికి న్యాయ సహాయం అందచేసి, వారికి చట్ట ప్రకారంగా వారి హక్కులను కాపాడటానికి న్యాయ సేవ సంస్థ కృషి చేస్తుందని, వయోవృద్దులు ఒంటరి వారు కారని వారికి చేయూత ఇవ్వటానికి ప్రభుత్వ సంస్థలే కాకుండ పౌరులుగా ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉందని తెలిపారు. న్యాయ సేవ సంస్థ వయోవృద్దులు ఎవరికైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు  అందనిచొ తగిన విదంగ స్పందించి న్యాయ సహాయం అందచేయటానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆశ్రమంలొ వారికి కల్పిస్తున్న వసతుల గురించి సమీక్షించి తగిన సూచనలు చేసారు. కార్యక్రమంలో వయోవృద్దుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మళ్ళిఖార్జున్ మాట్లాడుతూ సంఘం ద్వారా వయోవృద్దుల సంక్షేమానికి  ఎంతో కృషి చేస్తున్నామని, వయోవృద్దులకు ప్రభుత్వం తరుపున ఆశ్రమాలను నెలకొల్పాలని తెలిపారు. వయోవృద్దుల సంక్షేమ  ట్రిబ్యున...

**ఇద్దరి యువకుల ఆధ్యాత్మిక యాత్ర.. టెంపుల్ రన్**

Image
*ఇద్దరి యువకుల ఆధ్యాత్మిక యాత్ర.. టెంపుల్ రన్..*  సమాజంలో చోటు చేసుకుంటున్న అత్యాధునిక మార్పులు ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి.. ఈ మార్పులు కొంత వరకూ మేలు చేస్తుండగా అధిక శాతం చెడు మార్గాల వైపు మళ్లిస్తున్నాయి. ప్రధానంగా కెరీర్ ను అద్భుతంగా తీర్చి దిద్దుకోవాల్సిన యువత స్మార్ట్ ఫోన్ ల మోజులో పడి తమ వ్యక్తి గత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు పని ఒత్తిడిని ఎదుర్కొనలేక వ్యసనాలకు బానిసలుగా మారిపోతున్నారు.  ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపధ్యంలో తమిళనాడు లోని కారైకుడి ప్రాంతంలోని వేలంగుడికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పండిదురై.. కార్తికేయన్ లు అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర చేశారు. భారత దేశం.. నేపాల్ లలోని ప్రముఖ దేవాలయాలను వీరిద్దరూ దర్శించుకుని యువతకే కాకుండా అన్ని వర్గాల వారికి ఆదర్శంగా నిలిచారు. వారి సొంత కారులో 49 రోజుల పాటు 20,800 కిలోమీటర్లు ప్రయాణం చేసి 501 దేవాలయాలను దర్శించు కున్నారు. వారి స్వగ్రామంలో ప్రారంభమైన ఈ ఇద్దరి అన్నదమ్ముల అపురూపమైన ఆధ్యాత్మిక యాత్ర అదే గ్రామంలో ఇటీవల...

**మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు తప్పదు : ట్రాఫిక్ ఎస్.ఐ. కొండల్ రెడ్డి***

*మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు తప్పదు : ట్రాఫిక్ ఎస్.ఐ. కొండల్ రెడ్డి* - - నల్గొండ పట్టణంలో డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ - - 16 మందిని కోర్టులో హాజరు పరిచిన ట్రాఫిక్ పోలీసులు నల్గొండ : మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తుల వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు తప్పదని నల్గొండ ట్రాఫిక్ ఎస్.ఐ. కొండల్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ పట్టణంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో 16 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. 16 మందిని కోర్టులో హాజరు పర్చగా వారిలో అధిక మోతాదులో మద్యం సేవించిన ఆటో డ్రైవర్ ఎస్.కె. ఉస్మాన్ కు ఏడు రోజుల జైలు శిక్ష విధించారు. మిగిలిన 15 మందికి 16,500 రూపాయల జరిమానా విధించినట్లు కొండల్ రెడ్డి వివరించారు. ఆదివారం రోజున రోజు సైతం స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి 10 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ అన్ని రకాలుగా కృషి చేస్తున్నదని వాహనదారులు పోలీసులతో సహకరించాలని ఎస్.ఐ. కొండల్ రెడ్డి కోరారు.

**ఫిర్యాదుల పరిష్కారంలో మరింత శ్రద్ద : అదనపు ఎస్పీ సి. నర్మద**

Image
*ఫిర్యాదుల పరిష్కారంలో మరింత శ్రద్ద : అదనపు ఎస్పీ సి. నర్మద* నల్గొండ : పలు రకాల సమస్యలతో పోలీసుల వద్దకు వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని నల్గొండ అదనపు ఎస్పీ సి. నర్మద తెలిపారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆమె ఆర్జీలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పిర్యాదుదారుల నుండి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ ఫిర్యాదులపై సమీక్షించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యే విధంగా అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని ఆమె వివరించారు. సోమవారంతో పాటు సాదారణ రోజులలో సైతం ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని చెప్పారు.

**స్కూటి ఢికోని 14 నేలల బాలుడు మృతి...**

Image
మాదాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో స్కూటి ఢికోని 14 నేలల బాలుడు మృతి... భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్న రాజ్ కుమార్ తన మేనల్లుడుని ఏత్తుకోని జయభెరి సిలికాన్ టవర్స్ వద్ద రోడ్డు దాటుతుండగా మాదాపూర్ వైపు వేళ్లుతున్న స్కుటి ఢి కోనడంతో రాజ్ కుమార్ చేతుల నుంచి జారి రోడ్డు పై పడ్డ సతిష్ (14 నేలలు) మృతి చెందాడు.. రాజ్ కుమార్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు... నిందితుని అదుపులోకి తిసుకున్న పోలిసులు..

**స్పీడ్ పెంచిన ఎస్పీ భాస్కర్ భూషణ్**

నెల్లూరు జిల్లా *స్పీడ్ పెంచిన ఎస్పీ భాస్కర్ భూషణ్* *మరొకసారి సత్తాచాటిన సీసీఎస్ సీఐ శ్రీనివాసన్ అండ్ టీమ్* గుట్టుగా గుట్కాను, గంజాయిని తరలిస్తున్న అంతర్ జిల్లా ముఠాను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు.. -సూత్రదారి అంజిబాబుతో పాటు మరో 5 మందిని  వల పన్ని పట్టుకున్న పోలీసులు.. *వారి వద్ద నుంచి కోటి 32 లక్షలు విలువ చేసే రెండు లారీలు, ఒక ఇన్నోవా, ఒక ఓమ్ని వాహనం, గుట్కా, గంజాయి స్వాధీనం..

పాత కక్షల నెపద్యంలో గొడ్డలితో దాడి*

_*కృష్ణాజిల్లా :-  *పాత కక్షల నెపద్యంలో గొడ్డలితో దాడి* కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మద్యం మత్తు లో  ఘర్షణ..... బోదా కృష్ణ పై అవల నరసింహారావు అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేయటంతో తలకు బలమైన గాయం..... వెంటనే చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు చికిత్స చేస్తున్న వైద్యులు.....

**తనకు పుట్టలేదనే అనుమానంతో మూడు నెలల పసికందును చంపిన కసాయి తండ్రి**

*తనకు పుట్టలేదనే అనుమానంతో మూడు నెలల పసికందును చంపిన కసాయి తండ్రి* కడప జిల్లా..వేంపల్లె..  వేంపల్లె లో దారుణం చోటు చేసుకుంది..  భార్యపై అనుమానంతో మూడు నెలల  పసిగుడ్డును చంపిన కసాయి తండ్రి.. వేంపల్లె పాపాఘ్న నదిలో పూడ్చివేత.. వేంపల్లె లోని రాజీవ్ కాలానీ కి చెందిన వ్యక్తి.. పోలీసులకు తల్లి కృషిద శుక్రవారం పాప కనిపించలేదని ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు విచారణ చేయగా నిందితుడు గజేంద్ర తానే చంపానని చెప్పాడు .. తండ్రి సమాచారంతో వెలుగులోకి సంఘటన.. మృతదేహం వెలికితీత..నిందితుడు అరెస్టు.. మృతి చెందిన మూడు నెలల పసిపాప తండ్రి గజేంద్రకు రెండో భార్య సంతానం.

**బొకారో ఎక్స్ ప్రెస్ లో వీరంగం..**

బొకారో ఎక్స్ ప్రెస్ లో వీరంగం.. రైల్లో నుంచి హోంగార్డును కిందకు తోసేయడంతో మృతి విశాఖ వైపునకు వెళ్లే 'బొకారో'లో దారుణం తూ.గో జిల్లాలోని తుని రైల్వేస్టేషన్ సమీపంలో ఘటన మృతి చెందిన హోంగార్డు పేరు శివ విశాఖపట్టణం వైపునకు వెళ్లే బొకారో ఎక్స్ ప్రెస్ రైలులో దారుణం జరిగింది. ఓ ఉన్మాది సృష్టించిన వీరంగంతో హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు. తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైల్లో ప్రయాణికులను బయటకు గెంటేసేందుకు యత్నించిన ఉన్మాదిని ఓ హోంగార్డు అడ్డుకున్నాడు. దీంతో, రెచ్చిపోయిన ఉన్మాది.. హోంగార్డును రైల్లో నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన హోంగార్డు పేరు శివ అని, కోటనందూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు

**హైదరాబాదులో ఆరు చోట్ల సిబిఐ సోదాలు.**

*హైదరాబాదులో ఆరు చోట్ల సిబిఐ సోదాలు.* సినీఫక్కీలో రుణాలు తీసుకున్న ఆరుగురు ఇళ్లలో సిబిఐ సోదాలు. ఎస్బిఐ బ్యాంకు కు సంబంధించిన ఆరు నెలల్లో సోదాలు చేస్తున్న సి.బి.ఐ. తప్పుడు పత్రాలతో పాటు లేని మనుషులను ఉన్నట్లుగా చూపి రుణాలు తీసిన ప్రభుత్వ ఉద్యోగులు.  రీన్ లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రుణాలు పొందిన sbi ఉన్నత ఉద్యోగులు.  రీన్ లైఫ్ ల్యాబ్స్ పేరుతో 16 కోట్ల రూపాయలు రుణం తీసుకున్న ముఠా.  బ్యాంకు అధికారులు కలిసి  డబ్బులు డ్రా చేసిన వైనం.  హైదరాబాద్, మైసూర్, బెంగళూరులో సిబిఐ సోదాలు.

**గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ది చేసుకోవాలని ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అ**

జమస్తాన్ పల్లి(మర్రి గూడ),జనవరి 4.పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామస్థులు,ప్రజా ప్రతినిధులు,అధికారులు అందరూ భాగస్వామ్యులై గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ది చేసుకోవాలని  నల్గొండ ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.శని వారం పల్లెప్రగతి రెండవ దశ కార్య క్రమంలో బాగంగా మునుగొడ్ మండలం జమస్థాన్ పల్లి గ్రామంలో పాల్గొని గ్రామంలో పర్యటించి పల్లె ప్రగతి లో చేపట్టిన కార్యక్రమాలు పరిశీలించి గ్రామస్థుల తో చర్చించి అధికారులకు సూచనలు చేశారు.గ్రామం లో మొదటి దశ పల్లె ప్రగతి లో నిర్మించిన డ్రైన్ ను పరిశీలించారు.ప్రాథమిక పాఠశాల, ఆంగన్ వాడి సందర్శించి పిల్లలను పోషకాహారం, మెనూ గురించి ఆరా తీశారు. పాఠ శాల దగ్గర డంపింగ్ యార్డ్,స్మశాన వాటిక స్థలం పరిశీలించి  వెంటనే పనులు ప్రారంభించాలని పంచాయతీ రాజ్ ఏ.ఈ.,ఈ.జి.ఎస్ సిబ్బంది ఆదేశించారు. ప్రాథమిక పాఠశాల ముందు ,వర్షపు నీరు నిలిచి ఉండడం గమనించిన ఇంఛార్జి కలెక్టర్ కమ్యూనిటీ సోక్ పిట్ నిర్మాణం చేయాలని ఆదేశించారు.గ్రామంలో  పాత నీటి ట్యాంక్ నుండి మిషన్ భగీరథ త్రాగు నీటి ని నల్లాలు బిగించి అంద చేయాలని అర్.డబ్ల్యూ.ఎస్. ఈ ఈ.నీ ఆదేశించారు.ఈ కార్యక్రమం లో అర్.డి.ఓ...

**అమరావతి మందడంలో ఉద్రిక్తత... మహిళల అరెస్ట్**

అమరావతి మందడంలో ఉద్రిక్తత... మహిళల అరెస్ట్ ఓవైపు ఏలూరులో సీఎం జగన్... రాజధాని తరలింపునకు అనుకూలంగా సంకేతాలిస్తూ... ప్రకటన చెయ్యడంతో... అమరావతిలో ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతిలో ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతున్నాయి. ఆందోళన చేస్తున్న మహిళల్ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఇవాళ్టి నుంచీ సకల జనుల సమ్మెకు దిగారు అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు, ప్రజలు. తమకు న్యాయం జరగాల్సిందే అంటూ... తమ ఆందోళనలను పెంచుతూ... మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో... మందడంలో... మహిళల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కొంత మంది మహిళల్ని అరెస్టు చేశామంటున్నారు పోలీసులు. మరోవైపు రాజధానిని తరలించే అంశంపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు తీసుకున్న నిర్ణయాల్ని సరిదిద్దుతామన్నారు. తద్వారా రాజధానిని తరలించబోతున్నట్లు మరోసారి సంకేతాలిచ్చినట్లైంది. ఈ వార్త తెలిసిన తర్వాత... అమరావతి రైతులు... ...

**వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో నోటీసులు కలకలం**

*అమరావతి* *వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో నోటీసులు కలకలం* *పలువురు రైతులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు* *307 హత్యాయత్నం కేసుతో పాటు మరో 7సెక్షన్ల కింద కేసు నమోదు* *కేసులు ఉన్నందున పోలీస్ స్టేషన్ కు రావాలంటూ నోటీసులు* *విచారణకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని వెలగపూడి, మల్కాపురం గ్రామస్థులకు నోటీసులు* *సాయంత్రం 5గంటలకు చిలకలూరిపేట రూరల్ పీఎస్ కు ఆధార్ కార్డు తో రావాలని ఆదేశాలు* *దాదాపు 15మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు జారీ*

**వెలగపూడిలో 17వ రోజు రైతు రిలే నిరాహారదీక్ష లు**

*అమరావతి* *వెలగపూడిలో 17వ రోజు రైతు రిలే నిరాహారదీక్ష లు* గత రాత్రి వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో పోలీసులు హల్చల్ చేశారు. -రైతులు దోపిడీ, హత్యాయత్నం కేసులు ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. -రైతులు హత్యలు చేసేవారు, దోపీడీలకు పాల్పడేవారు ఎవ్వరూ లేరని వారికి తేల్చి చెప్పాం.- రైతులు ఇక్కడంతా రైతులు, రైతు కూలీలే ఉన్నారని నోటీసులు ఎవ్వరూ తీసుకోలేదు. -రైతులు  కొందరిని చిలకలూరిపేట, మరికొందరిని తెనాలి, ఇంకొందరిని గుంటూరు స్టేషన్లకు రావాలంటూ పోలీసులు బృందాలుగా తిరిగారు. తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి పీఎస్ లను కాదని ఎక్కడెక్కడో పీఎస్ ల్లో జారీ చేసిన నోటీసులకు మాకు సంబంధo ఏమిటి. -రైతులు

**అత్యవసర సమయంలో   రక్తధానం చేసిన  కానిస్టేబుల్ ను అభినందించిన డిజిపి***

*అత్యవసర సమయంలో   రక్తధానం చేసిన  కానిస్టేబుల్ ను అభినందించిన డిజిపి* పోలీసు ఉద్యోగం అంటే  సామాజిక సేవ అని,  ఈ విషయాన్ని మరోసారి నిరూపించిన సిద్దిపేట పోలీస్ కానిస్టేబుల్ శ్రీశైలం ను రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఎం. మహేందర్ రెడ్డి  అభినందించారు.  సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సందర్భంగా ఒక గర్భిణికి అత్యవసరంగా A+  రక్తం కావాల్సిఉండగా  అక్కడే విధులు నిర్వహిస్తున్న   ఏ పాజిటివ్ రక్తం వున్న శ్రీశైలం అనే పోలీస్ కానిస్టేబుల్  ఆ మహిళకు  రక్తదానం చేశారు. దీంతో ఆ మహిళ కు ప్రమాదం తప్పింది.  ఈ విషయాన్ని తెలుసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి కానిస్టేబుల్ శ్రీశైలం ను   అభినందించారు.  ఉద్యోగం అంటే సామాజిక సేవ అని పేర్కొంటూ,  ఈ విషయాన్ని శ్రీశైలం మరోసారి నిరూపించారని  డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.  ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభినందించారు.

**జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టి.జి.ఓ**

Image
జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టి.జి.ఓ* నూతన సంవత్సరంలో జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ది పరంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు వివిధ శాఖల జిల్లా అధికారులు అంకిత భావంతో పనిచేయాలని నల్గొండ ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.  తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఇంఛార్జి జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం లో ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్రశేఖర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు అర్.శ్రీనివాస మూర్తి,అసోసియేట్ అధ్యక్షులు ముజీబొద్దిన్,ఆర్గనైజింగ్ కార్యదర్శి గూడ వెంకటేశ్వర్లు,జాయింట్ సెక్రటరీ పి.శ్రీనివాస్,కార్యవర్గ సభ్యులు సురేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపి నోట్ పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల్లో,వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ సందర్భంగా అందచేశారు. అనంతరం జిల్లా ఎస్.పి. ఏ.వి.రంగనాథ్ ను కలిసి టీ.జి.ఓ.కార్యవర్గం నూతన్ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

** నల్గొండ ఇంఛార్జి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో ఆంగ్ల నూతన నూతన సంవత్సర సంబరాలు**

Image
* ఇంఛార్జి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో ఆంగ్ల నూతన నూతన సంవత్సరం సందర్భంగా ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ కేక్ కట్ చేసి అధికారులు,ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.నూతన సంవత్సరం లో అధికారులు,ఉద్యోగులు నూతనోత్తేజం తో పని చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ది ప థకాలు లక్ష్యిత  ప్రజలకు అందేలా చూడాలని ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు. రెండవ తేది నుండి నిర్వహించనున్న పల్లె ప్రగతి,మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా అధికారులు విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ  కృషి చేయాలని అన్నారు.డి.అర్.ఓ.రవీంద్ర నాథ్, అర్.డి.ఓ. జగదీశ్వర్ రెడ్డి,పలువురు జిల్లా అధికారులు జిల్లా సహకార అధికారి అర్.శ్రీనివాస మూర్తి,డి.పి.అర్.ఓ.పి.శ్రీనివాస్,గృహ నిర్మాణ శాఖ పి.డి.రాజ్ కుమార్,మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి గూడ వెంకటేశ్వర్లు,అర్. డబ్ల్యు.ఎస్. ఈ ఈ పాపా రావు,కలెక్టర్ కార్యాలయం ఏ.ఓ.మోతి లాల్,గెజిటెడ్,రెవెన్యూ,టీ.ఎన్.జి. వో.సంఘాల నాయకులు, తదితరులు ఇంఛార్జి కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

**సేవించి వాహనాల నడిపిన 3148 మందిపై కేసు నమోదు**

Image
హైదరాబాద్,  సైబరాబాద్ తెలంగాణ అన్ని జిల్లాలో డిసెంబర్ 31 అర్ధరాత్రి  239.చోట్ల డ్రంకన్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాల నడిపిన 3148 మందిపై కేసు నమోదు పోలీసులు..

**నాతోటి మహిళల బాధలు నేను అర్ధం చేసుకోగలను. - నారా భువనేశ్వరి**

*అమరావతి* *నారా భువనేశ్వరి, చంద్రబాబు సతీమణి* కామెంట్స్ *నాతోటి మహిళల బాధలు నేను అర్ధం చేసుకోగలను.* *ఆరోగ్యం గురించి మేము ఆందోళన చెందినా....చంద్రబాబు రాష్ట్రం గురించే ఆలోచన చేసేవారం* *ప్రజల తరువాతనే నన్ను, కుటుంబాన్ని పట్టించుకునే వారు.* *అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వొమ్ము చేయరు* *భోజనం చేసినా, పడుకున్నా అమరావతి, పోలవరం అనే తపించారు* *ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసమే కష్టపడ్డారు* *రైతులకు పూర్తి మద్దతుగా మా కుటుంబం అండ ఉంటుంది*