**జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టి.జి.ఓ**


జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టి.జి.ఓ*



నూతన సంవత్సరంలో జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ది పరంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు వివిధ శాఖల జిల్లా అధికారులు అంకిత భావంతో పనిచేయాలని నల్గొండ
ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.
 తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఇంఛార్జి జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం లో ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్రశేఖర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు అర్.శ్రీనివాస మూర్తి,అసోసియేట్ అధ్యక్షులు ముజీబొద్దిన్,ఆర్గనైజింగ్ కార్యదర్శి గూడ వెంకటేశ్వర్లు,జాయింట్ సెక్రటరీ పి.శ్రీనివాస్,కార్యవర్గ సభ్యులు సురేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపి నోట్ పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల్లో,వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ సందర్భంగా అందచేశారు. అనంతరం జిల్లా ఎస్.పి. ఏ.వి.రంగనాథ్ ను కలిసి టీ.జి.ఓ.కార్యవర్గం నూతన్ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్