**బొకారో ఎక్స్ ప్రెస్ లో వీరంగం..**

బొకారో ఎక్స్ ప్రెస్ లో వీరంగం..


రైల్లో నుంచి హోంగార్డును కిందకు తోసేయడంతో మృతి



విశాఖ వైపునకు వెళ్లే 'బొకారో'లో దారుణం
తూ.గో జిల్లాలోని తుని రైల్వేస్టేషన్ సమీపంలో ఘటన
మృతి చెందిన హోంగార్డు పేరు శివ



విశాఖపట్టణం వైపునకు వెళ్లే బొకారో ఎక్స్ ప్రెస్ రైలులో దారుణం జరిగింది. ఓ ఉన్మాది సృష్టించిన వీరంగంతో హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు. తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైల్లో ప్రయాణికులను బయటకు గెంటేసేందుకు యత్నించిన ఉన్మాదిని ఓ హోంగార్డు అడ్డుకున్నాడు. దీంతో, రెచ్చిపోయిన ఉన్మాది.. హోంగార్డును రైల్లో నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన హోంగార్డు పేరు శివ అని, కోటనందూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్