**మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు తప్పదు : ట్రాఫిక్ ఎస్.ఐ. కొండల్ రెడ్డి***

*మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు తప్పదు : ట్రాఫిక్ ఎస్.ఐ. కొండల్ రెడ్డి*



- - నల్గొండ పట్టణంలో డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్
- - 16 మందిని కోర్టులో హాజరు పరిచిన ట్రాఫిక్ పోలీసులు


నల్గొండ : మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తుల వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు తప్పదని నల్గొండ ట్రాఫిక్ ఎస్.ఐ. కొండల్ రెడ్డి అన్నారు.


సోమవారం నల్గొండ పట్టణంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో 16 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. 16 మందిని కోర్టులో హాజరు పర్చగా వారిలో అధిక మోతాదులో మద్యం సేవించిన ఆటో డ్రైవర్ ఎస్.కె. ఉస్మాన్ కు ఏడు రోజుల జైలు శిక్ష విధించారు. మిగిలిన 15 మందికి 16,500 రూపాయల జరిమానా విధించినట్లు కొండల్ రెడ్డి వివరించారు. ఆదివారం రోజున రోజు సైతం స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి 10 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.


రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ అన్ని రకాలుగా కృషి చేస్తున్నదని వాహనదారులు పోలీసులతో సహకరించాలని ఎస్.ఐ. కొండల్ రెడ్డి కోరారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్