**కళ్యాణ మహోత్సవానికి హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి**
కళ్యాణ మహోత్సవానికి హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి
నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం లో మంగళవారం నిర్వహించిన గోదాదేవి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ... మంత్రి నిరంజన్ రెడ్డి కి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా కళ్యాణ మహోత్సవానికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు .. కళ్యాణ మహోత్సవం లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు .. .. ఆలయంలో ముడుపు గట్టి మొక్కు చెల్లించుకుని ఆలయ అర్చకులు ఇచ్చిన తీర్థప్రసాదాలను స్వీకరించారు ... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దర్శించుకుం తానని, ఈ దేవాలయం మా కుటుంబానికి నమ్మకంగా నిలిచిందని పేర్కొన్నారు ... ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని ఆయన కోరారు ... రానున్న రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి మరలా దర్శించుకొంటా అని అన్నారు ... ఈ కార్యక్రమంలో లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీపీ బచుపల్లి శ్రీ దేవి గంగాధర్ రావు, జెడ్పిటిసి మాద ధనలక్ష్మీ నగేష్ గౌడ్, సర్పంచ్ ఏకుల కవిత విజయ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment