**శాంతి వయోవృద్దుల ఆశ్రమాన్ని సందర్శించిన నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి.వేణు


నల్లగొండ పట్టణంలోని గొల్లగూడలోగల శాంతి వయోవృద్దుల ఆశ్రమాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి.వేణు సందర్శించి ఆశ్రమంలొ ఉంటున్న వయోవృద్దులకు సంక్షేమ మరియు భరణం చట్టంపై అవగాహన కల్పించి, ఆశ్రమంలో ఉన్న వయోవృద్దులను వారు ఆశ్రమంలొ ఉండాల్సిన కారణాలను అడిగి తెలుసుకొని అర్హులైన వారికి న్యాయ సహాయం అందచేసి, వారికి చట్ట ప్రకారంగా వారి హక్కులను కాపాడటానికి న్యాయ సేవ సంస్థ కృషి చేస్తుందని, వయోవృద్దులు ఒంటరి వారు కారని వారికి చేయూత ఇవ్వటానికి ప్రభుత్వ సంస్థలే కాకుండ పౌరులుగా ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉందని తెలిపారు. న్యాయ సేవ సంస్థ వయోవృద్దులు ఎవరికైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు  అందనిచొ తగిన విదంగ స్పందించి న్యాయ సహాయం అందచేయటానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆశ్రమంలొ వారికి కల్పిస్తున్న వసతుల గురించి సమీక్షించి తగిన సూచనలు చేసారు. కార్యక్రమంలో వయోవృద్దుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మళ్ళిఖార్జున్ మాట్లాడుతూ సంఘం ద్వారా వయోవృద్దుల సంక్షేమానికి  ఎంతో కృషి చేస్తున్నామని, వయోవృద్దులకు ప్రభుత్వం తరుపున ఆశ్రమాలను నెలకొల్పాలని తెలిపారు. వయోవృద్దుల సంక్షేమ  ట్రిబ్యునల్ సభ్యులు యం. భిక్షమయ్య, మట్టపల్లి మాట్లాడుతూ వయోవృద్దుల వివాదాలను చట్ట ప్రకారంగా పరిష్కరించుటకు ట్రిబ్యునల్ సభ్యులుగా ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ఆశ్రమా నిర్వహకురాలు పిచ్చమ్మ మాట్లాడుతూ ఆశ్రమ నిర్వహణకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్న వాటిని డొనేషన్స్ ద్వారా అదిగమించి సేవా దృక్పందంతొ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో వయోవృద్దులు  పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్