**నేటి నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు**

*నేటి నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు* .


 *మోపిదేవి* 


 *ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆలయ కమిషనర్  జి.వి.డి.ఎన్ లీలా కుమార్*


 *కృష్ణాజిల్లా* 


 రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి...


 ప్రతి సంవత్సరం లానే జరుపుకునే వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ శనివారం వరకు నిర్వహిస్తారు...


 బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ పరిసరాలు ఆలయాన్ని రంగులు ,తోరణాలు, విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతోంది..


 బ్రహ్మోత్సవాల్లో భాగంగా *29వ తేదీ బుధవారం శ్రీ స్వామివారి, శ్రీ అమ్మవార్ల కళ్యాణం జరుగుతుంది..* 


 *30వ తేదీ గురువారం రథోత్సవం రాత్రి 8 గంటలకు జరుగుతుంది .* 


బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రల వ్యాప్తంగా భక్తులు విశేషంగా హాజరవుతారని, బ్రహ్మోత్సవం నిర్వహించే రోజులు భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని సహాయ కమిషనర్ జి .వి.డి.ఎన్   లీలాకుమార్ తెలిపారు..


 బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన ఈరోజు 11 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారుని చేయనున్నారు.. అవనిగడ్డ ఎం.ఎల్.ఏ సింహాద్రి రమేష్ బాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు ..


 *బస్సు సౌకర్యం* 


విజయవాడ నుండి, మచిలీపట్నం నుంచి, గుడివాడ నుంచి, గుంటూరు నుంచి ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని భక్తులు వేలాదిగా హాజరై బ్రహ్మోత్సవాలు తిలకించి స్వామి వారి కృపా కటాక్షాలు పొందాలని  లీలా కుమార్ కోరారు...... 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్