**స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి అజరామరం : అదనపు ఎస్పీ నర్మద**
*స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి అజరామరం : అదనపు ఎస్పీ నర్మద*
- - స్వాతంత్ర సమరంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను గుర్తు చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించిన పోలీసులు
నల్గొండ : దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలర్పించిన సమరయోధుల స్ఫూర్తి అజరామరమని జిల్లా అదనపు ఎస్పీ శ్రీమతి సి. నర్మద అన్నారు.
గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరయిపాలనలో అవస్థలు పడుతున్న దేశ ప్రజల బానిస సంకెళ్ల నుండి విముక్తి కల్పించడం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని విధి నిర్వహణలో మరింత సమర్ధవంతంగా పని చేస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. అనేక రకాల సమస్యలు, బాధలతో వచ్చే ప్రజలకు న్యాయం చేసే విధంగా పని చేయాలన్నారు. స్వాతంత్ర సమరంలో దేశం కోసం, దేశ ప్రజల కోసం త్యాగాలు చేసిన సమరయోధులను ప్రేరణగా తీసుకొని ప్రజలకు సేవలందించడంలో అగ్ర భాగంలో ఉండాలని ఆమె సూచించారు.
కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ వైభవ్ గైక్వాడ్, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణా రెడ్డి, డిపిఓ ఏ.ఓ. మంజు భార్గవి, సూపరింటెండెంట్లు అతిఖుర్ రెహమాన్, దయాకర్, ఆర్.ఐ.లు నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, సిఐలు రవీందర్, అంజయ్య, జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం అద్యక్షుడు రామచందర్ గౌడ్, నాయకులు సోమయ్య, జయరాజ్ తదితరులు పాల్గొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Comments
Post a Comment