**పోలీస్ శాఖ గౌరవం పెంచేలా సమజాభివృద్ధిలో బాగస్వామ్యులు కావాలి : ఎస్పీ రంగనాధ్**
*పోలీస్ శాఖ గౌరవం పెంచేలా సమజాభివృద్ధిలో బాగస్వామ్యులు కావాలి : ఎస్పీ రంగనాధ్*
నల్గొండ : పోలీస్ శాఖ ప్రతిష్ట, గౌరవం మరింత పెరిగే విధంగా పదవీ విరమణ పొందిన తర్వాత సమజాభివృద్ది కార్యక్రమాలలో బాగస్వాములవుతూ మంచి పేరు సంపాదించుకోవాలని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు.
గురువారం పోలీస్ శాఖలో పదవీ విరమణ పొందిన ఎస్.ఐ.లు ఏ.మధుసూధన్ రెడ్డి, జె. పెద్దులు, ఏ.ఎస్.ఐ. విజయపాల్ రెడ్డి, ఏ.ఆర్. ఎస్.ఐ. డి. వెంకట కిషన్ లను జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి వారి సేవలను ఎస్పీ అభినందించారు.
సమాజంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తూ శాంతియుత వాతావరణంలో ప్రజలు జీవించే విధంగా సేవలందించే అవకాశం పోలీస్ ఉద్యోగం ద్వారా లభిస్తుందని, పోలీస్ ఉద్యోగం ఎంతో ఉన్నతమైనదని పదవీ విరమణ తర్వాత ప్రజలలో పోలీసుల గౌరవం పెరిగే విధంగా వారితో మమేకం కావాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదురైనా నిత్యం ప్రజల కోసం పని చేయడంలో కలిగే సంతృప్తి అలాంటి వాటన్నింటిని మర్చిపోయేలా చేస్తుందని, పోలీస్ ఉద్యోగం లభించడం గర్వకారణమని అన్నారు.
*పదోన్నతి ద్వారా బాధ్యత పెరుగుతుంది*
- - విధి నిర్వహణలో రాజీ పడకుండా పని చేయాలి
- - పోలీస్ శాఖ గౌరవం పెరిగే విధంగా సేవలందించాలి
నల్గొండ : పదోన్నతి పొందిన పోలీస్ అధికారులు ప్రజా మన్ననలు పొందేలా పని చేస్తూ ప్రజలలో పోలీస్ శాఖ ప్రతిష్ట మరింత పెరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అన్నారు.
గురువారం సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తూ ఏ.ఎస్.ఐ.గా పదోన్నతి పొంది నల్గొండ జిల్లాకు కేటాయించబడిన బలరాం రెడ్డిని ఎస్పీ అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా ప్రజలు మెచ్చుకునేలా పనితీరు ఉండాలని సూచించారు. ప్రజలే మనకు యజమానులనే విషయాన్ని గుర్తించుకొని ప్రజలతో మమేకం అవుతూ ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి బాధలు, సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. ఏ ప్రాంతంలో పని చేసినా, ఏ బాధ్యతలతో ఉన్నా ప్రజాభిమానం పొందే విధంగా విధి నిర్వహణ చేయాలని. అప్పుడే పోలీసుల గౌరవం మరింత పెరుగుతుందని తెలిపారు. మన పనితీరుతోనే పోలీస్ శాఖ ప్రతిష్ట, గౌరవం ముడిపడి ఉన్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎస్పీ రంగనాధ్ తెలిపారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి సి.నర్మద, ట్రైనీ ఐపీఎస్ వైభవ్ గైక్వాడ్, పోలిస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాం చందర్ గౌడ్, సూర్యాపేట అధ్యక్షుడు అమర్ సింగ్, నాయకులు సోమయ్య, జయరాజ్ తదితరులు పాల్గొని పదవీ విరమణ పొందిన వారిని, పదోన్నతి పొందిన బలరాం రెడ్డిలను ఘనంగా సత్కరించి అభినందించారు.
Comments
Post a Comment