** నల్గొండ ఇంఛార్జి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో ఆంగ్ల నూతన నూతన సంవత్సర సంబరాలు**
* ఇంఛార్జి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో ఆంగ్ల నూతన నూతన సంవత్సరం సందర్భంగా ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ కేక్ కట్ చేసి అధికారులు,ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.నూతన సంవత్సరం లో అధికారులు,ఉద్యోగులు నూతనోత్తేజం తో పని చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ది ప థకాలు లక్ష్యిత ప్రజలకు అందేలా చూడాలని ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు. రెండవ తేది నుండి నిర్వహించనున్న పల్లె ప్రగతి,మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా అధికారులు విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు.డి.అర్.ఓ.రవీంద్ర నాథ్, అర్.డి.ఓ. జగదీశ్వర్ రెడ్డి,పలువురు జిల్లా అధికారులు జిల్లా సహకార అధికారి అర్.శ్రీనివాస మూర్తి,డి.పి.అర్.ఓ.పి.శ్రీనివాస్,గృహ నిర్మాణ శాఖ పి.డి.రాజ్ కుమార్,మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి గూడ వెంకటేశ్వర్లు,అర్. డబ్ల్యు.ఎస్. ఈ ఈ పాపా రావు,కలెక్టర్ కార్యాలయం ఏ.ఓ.మోతి లాల్,గెజిటెడ్,రెవెన్యూ,టీ.ఎన్.జి. వో.సంఘాల నాయకులు, తదితరులు ఇంఛార్జి కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Post a Comment