Posts

Showing posts from February, 2020

**నిబంధనలకు విరుద్ధంగా హుక్కా విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్**

  నిబంధనలకు విరుద్ధంగా హుక్కా విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్ .. నిబంధనలకు విరుద్ధంగా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు బంజారాహిల్స్ ఏసీపీ కెఎస్ రావు తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జూబ్లీహిల్స్ వన్ బై 9 చౌరస్తాలో హైదరాబాద్ టైమ్స్ కేఫ్ లో అక్రమంగా హుక్కా సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. కేఫ్ మేనేజర్ సాయి భరత్ ను అరెస్ట్ చేసి 10 హుక్కా పాట్స్, హుక్కా పైప్స్, ఫోర్ ఫ్లవర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న jeeshan పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఇదే తరహాలో మాకు బ్రేవ్ వాల్ కేఫ్ బార్ లో అక్రమ హుక్కా నిర్వహిస్తున్నట్లు మాకు సమాచారం రావడంతో దాడులు చేయగా కాఫీ బార్ మేనేజర్ జంగం nurandiya ను అరెస్ట్ చేసి 2 హుక్కా పాట్స్, హుక్కా పైప్స్, రెండు ఫ్లేవర్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో రాహుల్ bokadia పరారీలో ఉన్నట్లు త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అని చెప్పారు.

**పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి**

సూర్యాపేట పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి సూర్యపేట పురాపాలక సంఘం పరిధిలోని రెండో వార్డులో పట్టణ ప్రగతి ని ప్రారంభించిన,స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్ కుమార్ తదితరులు పట్టణ ప్రగతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,పాల్గొన్న కమిషనర్ రామంజూల్ రెడ్డి తదితరులు  _*మంత్రి జగదీష్ రరెడ్డి కామెంట్స్*_ ఆక్సిజనే అసలైన ఆస్తి  భవిష్యత్ తరాలకు అందించాల్సింది ఆక్సిజనే అది అందించే కార్యక్రమం మన ఇంటి నుండే మొదలు పెట్టాలి  యావత్ ప్రపంచాన్ని పర్యావరణం బెంబేలెత్తిస్తుంది మానవాళి మనుగడనే పర్యావరణం ప్రశ్నార్ధకంగా మార్చింది  అకాల జబ్బులకు పర్యావరణ సమస్యే కారణం  ఇప్పటికే ఉఛ్వాస నిచ్చావస లలో తేడా వస్తుంది  ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే భవిష్యత్ లో అక్షిజన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది  ఇప్పటికే మంచి నీళ్ళు కొనుగోలు చేస్తున్నాం  అటువంటి పరిస్థితులను దాటుకుని ముందుకు వెళ్ళాలి  అది ...

**కుక్కను డీ కొట్టి...**

కుక్కను డీ కొట్టి... జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం.. కెటిఎమ్ బైక్ పై వెళ్తున్న యువకునికి కుక్క అడ్డం రావడంతో కుక్క ను ఢీ కొట్టి ఆపై డివైడర్ డి కొన్న యువకుడు కుక్క తో పాటు యువకుడు కూడా మృతి.. మరో వాహనదరునికి గాయాలు.. KBR పార్క్ నుండి చెక్ పోస్ట్ వైపు వెళుతుండగా ప్రమాదం.. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

**నేర చరిత్ర ఉన్న రాజ‌కీయ‌వేత్త‌ల‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది**

*న్యూఢిల్లీ* *నేర చరిత్ర ఉన్న రాజ‌కీయ‌వేత్త‌ల‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది.* అలాంటి నేత‌ల‌ను మోస్తున్న రాజ‌కీయ పార్టీలు త‌మ వెబ్‌సైట్ల‌లో ఆ క‌ళంకిత నేత‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది.   48 గంట‌ల్లోనే వారి వివ‌రాల‌ను వెబ్‌సైట్ల‌లో పెట్టాల‌ని ఇవాళ ఆదేశించింది.  ఎటువంటి నేత‌ల‌పై ఎటువంటి నేరానికి సంబంధించిన కేసులు ఉన్నాయో, వారిని ఎందుకు  పార్టీలో చేర్చుకున్నారో అన్న అంశాల‌ను త‌మ త‌మ వెబ్‌సైట్ల‌లో పొందుప‌రుచాల‌ని కోర్టు త‌న తీర్పులో రాజ‌కీయ పార్టీల‌ను ఆదేశించింది.  రాజ‌కీయ‌ల్లో క్రిమిన‌ల్స్ పెరుగుతున్నార‌ని కోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.  జ‌స్టిస్ ఆర్ఎఫ్ నారీమ‌న్‌, ర‌వీంద్ర భ‌ట్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పునిచ్చింది.

**CM KCR: కేసీఆర్ నిర్ణయం.. సాగునీటి రంగంలో కీలక మార్పులు..!**

*CM KCR: కేసీఆర్ నిర్ణయం.. సాగునీటి రంగంలో కీలక మార్పులు..!* CM KCR: ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ కాళేశ్వరంను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తరువాత కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సాగునీటి రంగంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా, సాగునీటి లక్ష్యాల సాధనకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాలను పునర్ వ్యవస్థీకరణ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలు ఒకే గొడుగు క్రిందికి తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాగు నీటి ఇంజనీరింగ్ వ్యవస్థను 11 సర్కిళ్లుగా విభజించి.. ఆ సర్కిళ్లకు అధిపతిగా చీఫ్ ఇంజనీర్‌ను ఉంచాలని ఆయన నిర్ణయించారు. అలాగే జూన్ చివరికల్లా నీటి పారుదల ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని ఆయన వెల్లడించారు. ఇక నీటిపారుదల అధికారులు, సిబ్బందికి వచ్చే ఏప్రిల్ కల్లా క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తి పోసేలా అధికారులు సిద్ధంగా ఉండాలని.. రాష్ట్రంలోని అన్ని చెరువులు నింపేలా ప్రణాళిక రచించాలని కేసీఆర్ ఈ స...

**శక్తి టీం పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమం**

మహిళలు ఒంటరిగా లేక ప్రమాదకరమైన అత్యవసర సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై శక్తి టీం పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు... నందిగామ జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాల నందు శ్రావణి శివకుమారి పద్మావతి  పాల్గొని విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు వారికి వివరించారు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న దిశ చట్టం  గురించి  దిశ యాప్ గురించి విద్యార్థులకు వివరించారు.. మహిళల భద్రత కోసమే తమని ప్రభుత్వం నియమించింది అని ఎటువంటి అత్యవసర సమయంలో నైనా కాల్ చేయవచ్చునని, ప్రస్తుతం మహిళల భద్రత కోసం  ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల గురించి వివరించారు... అలాగే ఆపద సమయంలో ఉన్న మహిళలు ఉమెన్ helpline 1091 కి గాని, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి గాని, ఎక్స్ఎన్ఎక్స్ సహాయం కొరకు100 కి గాని,112 కి గాని,181 కి గాని కాల్ చేసి సమస్యను  తెలియజేస్తే తక్షణం పోలీసు వారు అక్కడికి చేరుకొని తగు సహాయం చేస్తారని వివరించారు

** *ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి* *

  *ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి*  మూస పద్దతిలో చేస్తున్న సాగుకు స్వస్తి పలకండి  లాభసాటి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తాం  ఫామాయిల్, కూరగాయలతో అధికంగా లాభాలు  ఖరీఫ్ నుండి సాగు నీరు పుష్కలం అపర భగిరదుడు ముఖ్యమంత్రి కేసీఆర్ బీళ్లుగా మారిన భూములను సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనదే  ఆయన చలువతోటే సూర్యపేట కు గోదావరి జలాలు  పరుగులు పెడుతున్న గోదావరి జలాలకు అడ్డు పడుతున్న అంతరాయలను తొలగించండి  కాళేశ్వరం చివరి ఆయకట్టు లో మంత్రి జగదీష్ రెడ్డి రెండోరోజు  పర్యటన మోటార్ సైకిల్ పై అరుగంటలు అన్ని తండాలలో పరిశీలన మంత్రి వెంట పరుగులు పెట్టిన నీటి పారుదల అధికారులు మూసపద్దతిలో చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి చేస్తున్న వరిపంటకు అంతిమంగా ఎకరాకు 15 వెలకంటే ఎక్కువగిట్టుబాటు కావడం లేదన్న అంశాన్ని రైతాంగం గుర్తించాలని ఆయన ఉపదేశించారు.అందుకు ప్రత్యామ్నాయం గా ఫామాయిల్, కూరగాయల వంటి పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. లాభ...

**బ్యాలెట్‌ పేపర్‌ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సునీల్‌ ఆరోరా స్పష్టం**

న్యూఢిల్లీ :  బ్యాలెట్‌ పేపర్‌ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సునీల్‌ ఆరోరా స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడం సాధ్యం కాదని, దీనిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు సునీల్‌ ఆరోరా.  ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేస్తున్నారన్న వార్తలను పూర్తిగా నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  త్వరలోనే రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల కోడ్‌పై చర్చిస్తామన్నారు.  అప్పుడప్పుడు వాహనాలు మొరాయించినట్లు ఈవీఎంలలో కూడా సమస్య తలెత్తుతుంది.  అంతేకానీ ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడానికి అవకాశం లేదన్నారు.  గత కొన్ని సంవత్సరాల నుంచి ఈవీఎంలను ఉపయోగిస్తున్నామని, ఇప్పుడు బ్యాలెట్‌ పేపర్‌కు వెళ్లే ప్రసక్తే లేదని సునీల్‌ ఆరోరా తేల్చిచెప్పారు.  సుప్రీంకోర్టు కూడా ఈవీఎంల వినియోగాన్ని సమర్థించిన విషయాన్ని సునీల్‌ ఆరోరా గుర్తు చేశారు. 

**రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్‌**

రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్‌ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన వారికి పెన్షన్‌ తొలిగించారని ప్రతిపక్షాలు భారీ ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెరిఫికేషన్‌ చేసిన తర్వాత అర్హత ఉందని తేలితే వారికి రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 5 రోజుల్లో పెన్షన్‌కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. మంగళవారం 'స్పందన' కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా 6,14,244 పెన్షన్లు ఇచ్చామనీ, పెన్షన్‌ అందలేదని పెద్ద ఎత్తున వస్తున్న వార్తలను వస్తున్నాయిని, పెన్షన్‌ అర్జీలను ఫిబ్రవరి 17 నాటికి రీ వెరిఫికేషన్‌ చేయాలని చెప్పారు  ఫిబ్రవరి18కల్లా అప్‌లోడ్‌ చేసి, ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సోషల్‌ ఆడిట్‌ చేయాలని అధికారులకు ఆదేశించారు. మార్చి 1న పెన్షన్‌ ఇవ్వాలని ఆదేశించారు. కార్డుతో కూడా అదే రోజు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎలాంటి వివక్ష చూపకూడదని తేల్చి చెప్పారు. కొత్తగా పెన్షన్లు 6,14,244 ఇచ్చామని, అయినా పెన్షన్లు తీసేసినట్లు ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు. అలాగే ...

**కేసీఆర్ పథకాలు మోడీని భయపెడుతున్నాయి*_   _*-మంత్రి జగదీష్ రెడ్డి*_ **

   _*కేసీఆర్ పథకాలు మోడీని భయపెడుతున్నాయి*_   _*-మంత్రి జగదీష్ రెడ్డి*_  తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చారు అంటూ పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యాల పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.శనివారం ఉదయం సూర్యపేట లో స్థానిక పురపాలక సంఘం చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ బాధ్యతల స్వీకారం సందర్భంగా ఆయన ముఖ్య అతిధి గా హాజరయ్యారు. అనంతరం పట్టణంలో నీ గాంధీ పార్క్ లో చైర్మన్ కు జరిగిన పౌర సన్మానం లో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్రమోడీ పై విరుచుకుపడ్డారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పధకాలు యావత్ భారతదేశంలో కొత్త చర్చకు తెరలేపాయన్నారు.దాంతో భయం పట్టుకున్న మోడీ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.   _*మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్*_  కేసీఆర్ పథకాలు మోడీని భయపెడుతున్నాయి  గుజరాత్ తో పాటు యావత్ భారతదేశంలో తెలంగాణ పధకాలపై చర్చ జరుగుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన రెండు వేలు, మూడు వేలు అటు గుజరాత్ లో ఇటు యావత్ భారతదేశ...

***💥హైదరాబాద్ లో రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏరియాలివే💥***

*💥హైదరాబాద్ లో రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏరియాలివే💥* హైదరాబాద్, వెలుగు :  నగరంలోని పలు మార్గాల్లో ఉన్న రోడ్లను విస్తరిస్తూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. నగర మేయర్ బొంతు రామ్మోహన్,  జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్,  స్టాండింగ్ కమిటీ సభ్యులు, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  స్టాండింగ్ కమిటీ సమావేశంలో 27 ఎజెండా అంశాలను చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు 3 ఏళ్ల కాలానికి  22 మాడ్యుల్స్కు రూ.5.9 కోట్లు చెల్లించుటకు ఆమోదం తెలపగా… హెల్త్ ఆఫీసర్లు నిర్వహిస్తున్న శానిటేషన్ బాధ్యతలను ఎన్విరాన్మెంట్ ఇంజినీర్లు, మున్సిపల్ ఇంజినీర్లకు బదిలీ చేశారు. అదేవిధంగా వైద్యాధికారులు, హెల్త్ అసిస్టెంట్లకు శానిటేషన్ విధుల నుండి మినహాయించగా, ఫుడ్ సేఫ్టీ, బస్తీ దవాఖానాలు హెల్త్ రిలేటెడ్ అంశాల విధులను కేటాయించారు. జీహెచ్ఎంసీ క్రీడా ప్రాంగణాల్లో మంత్లీ మెంబర్షిప్ రేట్లను పునర్వ్యవస్థీకరించుట,  లీగల్ అడ్వైజర్ సేవలను ఒక సంవత్సరం పాటు పొడిగింపు. టౌన్ప్లానింగ్ విభాగం హెడ్ ఆఫీస్తో పాటు ఖైరత...

**ఢిల్లీ  నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాలు,**

ఢిల్లీ  నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాలు,  హైద్రాబాద్ నగర శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మంచిరేవుల ప్రతిమ శ్రీనివాస్ ఇంట్లో  ఏకకాలంలో IT సోదాలు.* ఉదయం తెల్లవారు జమున నుంచి గంటలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న it సోదాలు. కేంద్ర బలగాలు బందోబస్తు నడుమ కొనసాగుతున్న సోదాలు.

**మేడారం జాతరలో మగ బిడ్డకు జన్మనిచ్చిన మహారాష్ట్ర వాసి**

మేడారం జాతరలో మగ బిడ్డకు జన్మనిచ్చిన మహారాష్ట్ర వాసి మీడియా సెంటర్, మేడారం,  మేడారం ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు ఓ భక్తురాలు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెలితే మహారాష్ట్ర, పుణె, శనినగర్ గ్రామానికి చెందిన  చవాన్ శివాని నిండు గర్భని. సమ్మక్క సారాలమ్మలను దర్శించుకోవాలనే తపనతో ప్రసవం తారీఖు దగ్గరపడ్డా లెక్కచేయకుండా మేడారం మంగళవారం కుటుంబంతో చేరుకున్నారు. గురువారం ఉదయం పురిటి నొప్పులు రావడం తో మేడారం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఉదయం 11.38  గంటలకు సాధారణ  ప్రసవం జరిగింది.   మొదటి సంతానంగా ఆడబిడ్డ వుందని ఇప్పుడు తల్లి సన్నిధిలో  మగబిడ్డ పుట్టడం చాలా ఆనందంగా ఉందని ,ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బంది మంచి సేవలు అందించారని, ఇటువంటి అటవీ ప్రాంతంలో ఆసుపత్రి ఏర్పాటు చేసి తన లాంటి భక్తులకు సరైన సమయంలో వైద్య సేవలు అందించడం పట్ల  మహిళ ఆనందం వ్యక్తం చేసింది. బాబు 3 1/2 కేజీల బరువుతో పుట్టాడని  తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

**ప్రజావాణి వినతులను సత్వరం పరిష్కరించాలి- ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ **

ప్రజావాణి  వినతులను సత్వరం పరిష్కరించాలని ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.  నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో  వివిధ శాఖల అధికారులను  సమావేశ పరిచి ప్రజా వాణి నిర్వహించారు. ఇంచార్జి జిల్లా కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో సమస్యల పరిష్కారం కోసం అందించిన  ఫిర్యాదులను  సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అన్నారు.  విద్యా శాఖ, గృహ నిర్మాణం ,ఎంప్లాయిమెంట్, మైనార్టీ వెల్ఫేర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ,పశు సంవర్థక శాఖ, తదితర శాఖల కు  చెందిన ఫిర్యాదులు (100) వచ్చాయని తెలిపారు. *వైకుంఠ ధామం నిర్మాణం కు స్థలం అంద చేసిన దాత లను అభినందించిన జిల్లా కలెక్టర్*  త్రిపురారం మండలం దుగ్గే పల్లి  గ్రామం కు చెందిన పి.శ్రీకాంత్ ఒక ఎకరం ఐదు గుంటలు,జి.యాదగిరి,పులిపాటి సత్యం లు ఒక ఎకరం చొప్పున   వైకుంఠ ధామం నిర్మాణం కు విరాళంగా తమ భూమిని అందచేస్తున్నట్లు ప్రజావాణి కార్యక్రమంలో ఇంఛార్జి కలెక్టర్ కు లేఖ ఇస్తూ సమ్మతి తెలుపుతూ హద్దులు నిర్ణయించాలని కోరారు.ఇంఛార్జి జిల్లా కలెక్టర్ జిల్లా ...

**ఫిర్యాదుల పరిష్కారంలో మరింత శ్రద్ద : అదనపు ఎస్పీ సి. నర్మద**

*ఫిర్యాదుల పరిష్కారంలో మరింత శ్రద్ద : అదనపు ఎస్పీ సి. నర్మద* నల్గొండ : పలు రకాల సమస్యలతో పోలీసుల వద్దకు వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని నల్గొండ అదనపు ఎస్పీ సి. నర్మద తెలిపారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆమె ఆర్జీలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పిర్యాదుదారుల నుండి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ ఫిర్యాదులపై సమీక్షించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యే విధంగా అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని ఆమె వివరించారు. సోమవారంతో పాటు సాదారణ రోజులలో సైతం ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని చెప్పారు.

**సుప్రీం’ తీర్పునకు లోబడే ‘స్థానిక’ రిజర్వేషన్లు**

‘సుప్రీం’ తీర్పునకు లోబడే ‘స్థానిక’ రిజర్వేషన్లు రాష్ట్రంలో బీసీ ఓటర్లు 48.13% కానీ, రిజర్వేషన్లు 34 శాతమే  పంచాయతీ ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నిధులు ఇవ్వదు  దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోతుంది  విద్య, ఉపాధి రిజర్వేషన్లకు, రాజకీయ రిజర్వేషన్లకు వ్యత్యాసం ఉంది   హైకోర్టులో పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి కౌంటర్‌ దాఖలు  అమరావతి: వెనుకబడిన తరగతులకు (బీసీ) తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా చట్టాలు తీసుకువచ్చే అధికారం తమకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అందుకు అనుగుణంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1995లో పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు జరిగాయని తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా.. వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించామని, కానీ బీసీలకు మాత్రం 1995 చట్ట సవరణను అనుసరించి 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని వివరించింది. 1995లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు, 1991 జనాభా లెక్కల ప్రకారం బీసీ జనాభా ఆంధ్రప్రదేశ్‌లో 39 శాతం మేర ఉందని తెలిపింది. రాష్ట్ర విభజన తరువాత ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ నిర...

**పి.వి.నరసింహారావు ఫ్లైఓవర్ పై  రెండు స్పోర్ట్స్ కార్లు హల్ చల్*....**

*రాజేంద్రనగర్*  *పి.వి.నరసింహారావు ఫ్లైఓవర్ పై  రెండు స్పోర్ట్స్ కార్లు హల్ చల్*.... రెండు స్పోర్ట్స్ కార్లు అతి వేగంగా డ్రైవ్ చేస్తున్న ఇద్దరు డ్రైవర్లు అదుపులోకి తీసుకోన పోలీసులు... శంషాబాద్ నుండి మెహదీపట్నం వైపు వస్తున్న కార్లు... పోలీసులు వెంబడించి రెండు కార్లును  పట్టుకున్నారు... రెండు కార్లుల సీజ్ చేసి  రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు..

**వేగ నియంత్రణ, ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ వి. చంద్రశేఖర్**

*వేగ నియంత్రణ, ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ వి. చంద్రశేఖర్* - - జిల్లాలో ఇక హెల్మెట్ వినియోగం తప్పని సరి : ఎస్పీ రంగనాధ్ - - మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనాలు సీజ్, రిమాండ్ తప్పదని ఎస్పీ హెచ్చరిక - - లైసెన్స్, వాహనాల ధ్రువపత్రాలు  తనిఖీకి ప్రత్యేక చర్యలు - - అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే అధిక రోడ్డు ప్రమాదాలు నల్లగొండ : వాహనాల వేగ నియంత్రణ, ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించినప్పుడే రోడ్డు ప్రమాదల శాతం తగ్గుతుందని నల్గొండ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు. 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా శనివారం స్థానిక లక్ష్మీ గార్డెన్స్ లో నల్గొండ ట్రాఫిక్ సి.ఐ. సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆటో, ట్యాక్సీల డ్రైవర్లు, ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులు, యువత, పాఠశాల, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన కల్పించే విధంగా నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమని, రోడ్డు ప్...