**ప్రజావాణి వినతులను సత్వరం పరిష్కరించాలి- ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ **

ప్రజావాణి  వినతులను సత్వరం పరిష్కరించాలని ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు. 



నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో  వివిధ శాఖల అధికారులను  సమావేశ పరిచి ప్రజా వాణి నిర్వహించారు. ఇంచార్జి జిల్లా కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో సమస్యల పరిష్కారం కోసం అందించిన  ఫిర్యాదులను  సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అన్నారు.  విద్యా శాఖ, గృహ నిర్మాణం ,ఎంప్లాయిమెంట్, మైనార్టీ వెల్ఫేర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ,పశు సంవర్థక శాఖ, తదితర శాఖల కు  చెందిన ఫిర్యాదులు (100) వచ్చాయని తెలిపారు.
*వైకుంఠ ధామం నిర్మాణం కు స్థలం అంద చేసిన దాత లను అభినందించిన జిల్లా కలెక్టర్*
 త్రిపురారం మండలం దుగ్గే పల్లి  గ్రామం కు చెందిన పి.శ్రీకాంత్ ఒక ఎకరం ఐదు గుంటలు,జి.యాదగిరి,పులిపాటి సత్యం లు ఒక ఎకరం చొప్పున   వైకుంఠ ధామం నిర్మాణం కు విరాళంగా తమ భూమిని అందచేస్తున్నట్లు ప్రజావాణి కార్యక్రమంలో ఇంఛార్జి కలెక్టర్ కు లేఖ ఇస్తూ సమ్మతి తెలుపుతూ హద్దులు నిర్ణయించాలని కోరారు.ఇంఛార్జి జిల్లా కలెక్టర్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి,జిల్లా పంచాయతీ అధికారి కి ఆదేశాలు జారీ చేశారు.ఈ   సందర్భముగా  భూమిని ఇచ్చిన దాతలను వారిని ఇంఛార్జి జిల్లా  కలెక్టర్ వన మాల చంద్ర శేఖర్, అధికారులు దాతలను అభినందించారు.
ఈ సమావేశములో గృహ నిర్మాణ శాఖ పి.డి.రాజ్ కుమార్,మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి, వెంకటేశ్వర్లు , లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యం ,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి,  జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి సంగీత లక్ష్మి,  కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.
,


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్