**CM KCR: కేసీఆర్ నిర్ణయం.. సాగునీటి రంగంలో కీలక మార్పులు..!**

*CM KCR: కేసీఆర్ నిర్ణయం.. సాగునీటి రంగంలో కీలక మార్పులు..!*


CM KCR: ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ కాళేశ్వరంను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తరువాత కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సాగునీటి రంగంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా, సాగునీటి లక్ష్యాల సాధనకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాలను పునర్ వ్యవస్థీకరణ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలు ఒకే గొడుగు క్రిందికి తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాగు నీటి ఇంజనీరింగ్ వ్యవస్థను 11 సర్కిళ్లుగా విభజించి.. ఆ సర్కిళ్లకు అధిపతిగా చీఫ్ ఇంజనీర్‌ను ఉంచాలని ఆయన నిర్ణయించారు. అలాగే జూన్ చివరికల్లా నీటి పారుదల ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని ఆయన వెల్లడించారు.
ఇక నీటిపారుదల అధికారులు, సిబ్బందికి వచ్చే ఏప్రిల్ కల్లా క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తి పోసేలా అధికారులు సిద్ధంగా ఉండాలని.. రాష్ట్రంలోని అన్ని చెరువులు నింపేలా ప్రణాళిక రచించాలని కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో కొత్త కలెక్టరేట్‌లను నిర్మించాలని.. వీటిని నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్