**కేసీఆర్ పథకాలు మోడీని భయపెడుతున్నాయి*_ _*-మంత్రి జగదీష్ రెడ్డి*_ **
_*కేసీఆర్ పథకాలు మోడీని భయపెడుతున్నాయి*_
_*-మంత్రి జగదీష్ రెడ్డి*_
తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చారు అంటూ పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యాల పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.శనివారం ఉదయం సూర్యపేట లో స్థానిక పురపాలక సంఘం చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ బాధ్యతల స్వీకారం సందర్భంగా ఆయన ముఖ్య అతిధి గా హాజరయ్యారు. అనంతరం పట్టణంలో నీ గాంధీ పార్క్ లో చైర్మన్ కు జరిగిన పౌర సన్మానం లో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్రమోడీ పై విరుచుకుపడ్డారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పధకాలు యావత్ భారతదేశంలో కొత్త చర్చకు తెరలేపాయన్నారు.దాంతో భయం పట్టుకున్న మోడీ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
_*మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్*_
కేసీఆర్ పథకాలు మోడీని భయపెడుతున్నాయి
గుజరాత్ తో పాటు యావత్ భారతదేశంలో తెలంగాణ పధకాలపై చర్చ జరుగుతుంది
ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన రెండు వేలు, మూడు వేలు అటు గుజరాత్ లో ఇటు యావత్ భారతదేశంలో ఎందుకు అమలు చేయడం లేదు
15 ఏండ్లు గుజరాత్ ను పాలించిన మోడీ ఆ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలకు ఎందుకు రూప కల్పన చెయ్యలేక పోయారు
రైతుబందు,రైతుభిమా తామెందుకు కళ్ళ చూడలేక పోయామన్న బాధ గుజరాత్ తో పాటు యావత్ భారత రైతాంగాన్ని వెంటాడుతోంది.
కొత్త రాష్ట్రం తెలంగాణా లోమూడేండ్ల కే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందించగలిగినప్పుడు ఆరు ఏండ్లు ప్రధానిగా 15 ఏండ్లు ముఖ్యమంత్రి గా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వ లేక పోయారు
దేశ ప్రజల నుండి వస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సివస్తుందన్న బయంతోటే పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై దాడికి దిగుతున్నారు
ఏ సందర్భం లేకున్నా ఉభయ సభలలో తెలంగాణా ఇవ్వడమే అన్యాయం అన్న పద్దతిలో మాట్లాడుతున్నారు
తెలంగాణా ఏర్పడక పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఉండేవారు కాదని ,నాకు ఈ చిక్కులు వచ్చేవి కావని మోడీ భావిస్తున్నారు.
Comments
Post a Comment