**నిబంధనలకు విరుద్ధంగా హుక్కా విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్**

 


నిబంధనలకు విరుద్ధంగా హుక్కా విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్ ..


నిబంధనలకు విరుద్ధంగా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు బంజారాహిల్స్ ఏసీపీ కెఎస్ రావు తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జూబ్లీహిల్స్ వన్ బై 9 చౌరస్తాలో హైదరాబాద్ టైమ్స్ కేఫ్ లో అక్రమంగా హుక్కా సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. కేఫ్ మేనేజర్ సాయి భరత్ ను అరెస్ట్ చేసి 10 హుక్కా పాట్స్, హుక్కా పైప్స్, ఫోర్ ఫ్లవర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న jeeshan పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఇదే తరహాలో మాకు బ్రేవ్ వాల్ కేఫ్ బార్ లో అక్రమ హుక్కా నిర్వహిస్తున్నట్లు మాకు సమాచారం రావడంతో దాడులు చేయగా కాఫీ బార్ మేనేజర్ జంగం nurandiya ను అరెస్ట్ చేసి 2 హుక్కా పాట్స్, హుక్కా పైప్స్, రెండు ఫ్లేవర్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో రాహుల్ bokadia పరారీలో ఉన్నట్లు త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అని చెప్పారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్