**బ్యాలెట్‌ పేపర్‌ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సునీల్‌ ఆరోరా స్పష్టం**

న్యూఢిల్లీ : 


బ్యాలెట్‌ పేపర్‌ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సునీల్‌ ఆరోరా స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 


ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడం సాధ్యం కాదని, దీనిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు సునీల్‌ ఆరోరా. 


ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేస్తున్నారన్న వార్తలను పూర్తిగా నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 


త్వరలోనే రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల కోడ్‌పై చర్చిస్తామన్నారు. 


అప్పుడప్పుడు వాహనాలు మొరాయించినట్లు ఈవీఎంలలో కూడా సమస్య తలెత్తుతుంది. 


అంతేకానీ ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడానికి అవకాశం లేదన్నారు. 


గత కొన్ని సంవత్సరాల నుంచి ఈవీఎంలను ఉపయోగిస్తున్నామని, ఇప్పుడు బ్యాలెట్‌ పేపర్‌కు వెళ్లే ప్రసక్తే లేదని సునీల్‌ ఆరోరా తేల్చిచెప్పారు. 


సుప్రీంకోర్టు కూడా ఈవీఎంల వినియోగాన్ని సమర్థించిన విషయాన్ని సునీల్‌ ఆరోరా గుర్తు చేశారు. 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!