**మేడారం జాతరలో మగ బిడ్డకు జన్మనిచ్చిన మహారాష్ట్ర వాసి**
మేడారం జాతరలో మగ బిడ్డకు జన్మనిచ్చిన మహారాష్ట్ర వాసి
మీడియా సెంటర్, మేడారం,
మేడారం ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు ఓ భక్తురాలు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెలితే మహారాష్ట్ర, పుణె, శనినగర్ గ్రామానికి చెందిన చవాన్ శివాని నిండు గర్భని. సమ్మక్క సారాలమ్మలను దర్శించుకోవాలనే తపనతో ప్రసవం తారీఖు దగ్గరపడ్డా లెక్కచేయకుండా మేడారం మంగళవారం కుటుంబంతో చేరుకున్నారు. గురువారం ఉదయం పురిటి నొప్పులు రావడం తో మేడారం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఉదయం 11.38 గంటలకు సాధారణ ప్రసవం జరిగింది. మొదటి సంతానంగా ఆడబిడ్డ వుందని ఇప్పుడు తల్లి సన్నిధిలో మగబిడ్డ పుట్టడం చాలా ఆనందంగా ఉందని ,ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బంది మంచి సేవలు అందించారని, ఇటువంటి అటవీ ప్రాంతంలో ఆసుపత్రి ఏర్పాటు చేసి తన లాంటి భక్తులకు సరైన సమయంలో వైద్య సేవలు అందించడం పట్ల మహిళ ఆనందం వ్యక్తం చేసింది. బాబు 3 1/2 కేజీల బరువుతో పుట్టాడని తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Comments
Post a Comment