రూ.1400 కోట్లు మహిళా సంఘాల ఖాతాల్లో వేసిన ఏపీ సీఎం జగన్
రూ.1400 కోట్లు మహిళా సంఘాల ఖాతాల్లో వేసిన ఏపీ సీఎం జగన్
సెర్ప్, మెప్మా పరిధి ప్రాంతాల్లోని పొదుపు సంఘాల ఖాతాల్లో నగదు జమ
90,37,254 మంది మహిళలకు లబ్ధి
'వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం' కింద సాయం
కట్టవలసిన మొత్తం వడ్డీని వేసిన ప్రభుత్వం
కరోనా విజృంభణ నేపథ్యంలో మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు సీఎం జగన్ ఈ రోజు సున్నా వడ్డీ పథకం ప్రారంభించారు. ఈ మేరకు రూ.1400 కోట్లు విడుదల చేశారు. వడ్డీ కింద ఈ డబ్బులు జమ చేస్తారు. ఈ మేరకు రూ.1400 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ఏపీలో 90,37,254 మందికి లబ్ధి చేకూరుతుంది.
'వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం' కింద స్వయం సహాయక సంఘాలు 2019, ఏప్రిల్ 1 నుండి 2020, మార్చి 31 వరకు కట్టవలసిన మొత్తం వడ్డీ రూ.1400 కోట్లను మహిళల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆయా సంఘాల ఖాతాల్లో జమచేసింది.
సెర్ప్, మెప్మా పరిధి ప్రాంతాల్లోని పొదుపు సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ అయింది. దీని వల్ల పేద మహిళలకు ఎంతగానో లాభం చేకూరుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఆన్‌లైన్ ద్వారా ఒకే ఒక్క క్లిక్‌తో సీఎం జగన్ నగదు బదిలీ చేశారు. దీంతో సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్ ద్వారా డబ్బులు జమ అయ్యాయి.
ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలతో సీఎం జగన్ మాట్లాడారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంపై ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి అందుతోన్న సాయంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Post a Comment