ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్ చెక్కులపై పేర్లు రాయండి
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్ చెక్కులపై పేర్లు రాయండి
పేర్లు రాయకుండా ఖాళీ చెక్కులు ఇవ్వొద్దని బిజెపి నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి విన్నపం
కోవిడ్ 19 విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మానవతా దృక్పథంతో ఇస్తున్న విరాళాల విషయంలో దాతలు కొన్ని నిబంధనలు పాటించాలని మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా ఆర్థిక సహాయం కింద ఎవరు విరాళాల రూపంలో చెక్కులు ఇచ్చినా చెక్కులపై పీఎం లేదా సీఎం రిలీఫ్ ఫండ్ అని స్పష్టంగా రాసి ఇవ్వాలని సూచించారు.
చాలామంది ఖాళీ చెక్కులు ఇవ్వడం వల్ల అవి పక్కదారి పట్టే పరిస్థితులు ఉన్నాయని, కొంతమంది చెక్కులు స్వచ్ఛందంగా తమ స్వచ్ఛంద కార్యకలాపాలకు లేదా ఇతర సంస్థలకు చెల్లిస్తున్నారని ఇది సమంజసం కాదని తెలిపారు. ఎవరైనా సరే చెక్కులపై స్పష్టంగా పేర్లు రాసి ఇవ్వాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సరే తమ చెక్కులపై పేరు రాయడం మర్చిపోకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతి పైసా పేదవాడికి చెందే విధంగా ఉండాలని ఆయన కోరారు. దయాగుణం తో ఇచ్చే ప్రతి పైసా పేదవాడికి అందాలనే తన ఉద్దేశమని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Post a Comment