హరీస్, హాలిమ్ విక్రయాలు సాగిస్తు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి
హరీస్, హాలిమ్ విక్రయాలు సాగిస్తు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి
హాలిమ్, హారీస్ కౌంటర్లకు ఎక్కడా అనుమతి ఇవ్వలేదు
బేకరీలు, పాన్, కిరాణా షాపులు కౌంటర్లు ఏర్పాటు చేయడం నిషేధం
వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ ఆధ్వర్యంలో కేసుల నమోదు
నల్లగొండ : లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి హరీస్, హాలీమ్ కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్న అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
బుధవారం నల్లగొండ పట్టణంలో వన్ తౌన్ పరిధిలో రాయల్ సి కేఫ్, స్పైసి హోటల్, గ్రాండ్ హోటల్స్ నిర్వాహకులు, సిబ్బంది లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ నేతృత్వంలో కేసులు నమోదు చేశామని చెప్పారు. హరీస్, హాలిమ్ విక్రయాలు సాగిస్తున్న స్పైసి హోటల్ నిర్వాహకుడు యం.డి.ఫరీదుద్దీన్, అందులో పని చేసే ముస్తాక్, రాయల్ సి కేఫ్ నిర్వాహకుడు ఇమ్రాన్, అందులో వంట మాస్టర్ గా పని చేసే మహ్మద్ లతీఫ్, గ్రాండ్ హోటల్ నిర్వాహకుడు షేక్ అరిఫ్ లను అదుపులోకి తీసుకొని ఏపీడమిక్ డిసిస్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టుల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలో హరీస్, హాలిమ్ విక్రయాల నిమిత్తం కౌంటర్లు ఏర్పాటుకు పోలీస్ శాఖ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆయన చెప్పారు. కొంతమంది వ్యక్తులు ఎలాంటి ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా పట్టణంలోని పలు పాన్ షాప్స్, బేకరీల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారని ఇవి పూర్తిగా నిషేధమని ఆయన తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడా హాలీమ్, హరీస్ విక్రయాలను కౌంటర్లు ఏర్పాటు చేయడం, బట్టీలు పెట్టుకోవడం, డోర్ డెలివరీ చేయడం నిషేధమని అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాన్ షాప్స్, బేకరీలు, కిరాణా దుకాణ వ్యాలరులు ఎవరైనా హరీస్, హాలిమ్ కౌంటర్లు పెట్టి విక్రయించకూడదని డిఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలంతా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ పోలీసులతో సహకరించాలని ఆయన కోరారు. ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన కొన్ని మినహాయింపులు కేవలం గ్రామీణ ప్రాంతాల వరకే పరిమితమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కల్పించిన మినహాయింపులు పట్టణ ప్రాంతాలకు వర్తించవని అందువల్ల పట్టణ ప్రాంతాల వ్యాపారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమతో సహకరించాలని ఆయన సూచించారు.
Comments
Post a Comment