50 లక్షల బీమా పథకాన్ని అమలు చేయాలి-టీయూడబ్ల్యూజే (ఐ జే యు)డిమాండ్

50 లక్షల బీమా పథకాన్ని అమలు చేయాలి-టీయూడబ్ల్యూజే (ఐ జే యు)డిమాండ్


కరోనా మహమ్మారిని అరికట్టడంలో వైద్య ఆరోగ్య మున్సిపల్ పోలీస్ రెవెన్యూ శాఖల అధికారులు ఉద్యోగుల తో పాటుగా జర్నలిస్టులు కూడా ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని వారికి కూడా కేంద్రం ప్రకటించిన 50 లక్షల బీమా పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఇండియన్ జర్నలిస్టుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి ముంబైలో లో 53 మంది జర్నలిస్టులకు కరోనా వ్యాధి సోకిన నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు ప్రత్యేక బీమా పథకాన్ని అమలు చేయడంతోపాటు  వారి కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదని గుర్తించాలని
టీయూడబ్ల్యూజే (ఐ జే యు) అధ్యక్షులు నగునూరి శేఖర్,  ప్ర.కార్యదర్శి కే. విరాహత్అలీ  డిమాండ్ చేశారు.
 తమిళనాడు ప్రభుత్వం వారి రాష్ట్రంలో లో పనిచేస్తున్న జర్నలిస్టులకు లాక్ డౌన్ కాలంలో నెలకు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడాన్ని గుర్తు చేస్తున్నామని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆర్థిక బీమా పథకాలను ప్రకటించాలని టీయూడబ్ల్యూజే (ఐ జే యు)డిమాండ్ చేస్తున్నదని తెలిపారు.


 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్