జర్నలిస్టులందరికీ రూ.50 లక్షల బీమా కల్పించాలి- తెలంగాణ సీఎస్ కు తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ వినతి
జర్నలిస్టులందరికీ రూ.50 లక్షల బీమా కల్పించాలి- తెలంగాణ సీఎస్ కు తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ వినతి
తెలంగాణలోని ప్రతి జర్నలిస్టుకూ రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షులు పల్లె రవికుమార్, ప్రధాన కార్యదర్శి మేకల క్రుష్ణ కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కలిసి వారు వినతిపత్రం సమర్పించారు. నానాటికీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి ఏ విధంగా అయితే బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారో, అదేవిధంగా ప్రాణాలు సైతంగా ఫణంగా పెట్టి పనిచేస్తున్న జర్నలిస్టులకూ బీమాను వర్తింపజేయాలని మనవి చేశారు. ఇప్పటికే పలు రాష్ర్ట ప్రభుత్వాలు జర్నలిస్టులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయాన్ని
తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షులు పల్లె రవికుమార్ గుర్తు చేశారు. అలాగే.. ఈ విపత్కర సమయంలో ప్రతి జర్నలిస్టు కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలన్నారు. మరోవైపు..తెలంగాణలో పత్రికలు, చిన్న పత్రికలు, చానళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి వాటిని ఆదుకోవాలని
తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ నేతలు కోరారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, టీ జర్నలిస్టుల ఫోరమ్ డిమాండ్లను పరిశీలించాల్సిందిగా అక్కడే ఉన్న సమాచార శాఖా కమిషనర్ అరవింద్ కుమార్ ను ఆదేశించారు. అలాగే.. జర్నలిస్టుల సమస్యలను తప్పకుండా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Post a Comment