ఎమ్మెల్యే కంచర్ల కు  ముఖ్యమంత్రి సహాయనిధికి 50 వేల చెక్కును అందచేసిన మనోరమ హోటల్ యాజమాన్యం


భౌతిక దూరం పాటించండి - మాస్కు ధరించండి కరోనా  నివారణకు పాటు పడండ


ఎమ్మెల్యే కంచర్ల కు  ముఖ్యమంత్రి సహాయనిధికి 50 వేల చెక్కును అందచేసిన మనోరమ హోటల్ యాజమాన్యం


నల్లగొండ మనోరమ హోటల్ కు చెందిన యాజమాన్యం బాలాజీ నాయక్, గద్దర్ (కాసాల) నర్సిరెడ్డి, రేగట్ట నవీన్ రెడ్డి.. 50,000/-రూపాయలు విలువ  చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధి( రిలీఫ్ ఫండ్) కు గాను నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ  రెక్కాడితే కానీ డొక్కాడని పేద వర్గాలకు కరోనా శాపంగా పరిణమించినదని దాతలు  పదిమందికి సహాయపడాలనే మనసున్న వారు ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని  కోరారు. విరాళాలు అందించిన మనోరమ హోటల్ యజమానులకు  కృతజ్ఞతలు తెలియజేశారు. నల్లగొండ నియోజకవర్గంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి తమ తమ పరిధిలో వంట సామాగ్రి అన్నదానం  మాస్కులు శానిటరీ కిట్ లు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్. పదో వార్డు కౌన్సిలర్ ఆంగోతు ప్రదీప్ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


భౌతిక దూరం పాటించండి - మాస్కు ధరించండి


కరోనా  నివారణకు పాటు పడండి


 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్