సూర్యాపేటలో కరోనా నివారణకు సమర్థవంతంగా  పనిచేసేందుకు  అదనపు అదికారులను నియమించాం-CS సోమేశ్ కుమార్



కరోనా నివారణకు సమర్థవంతంగా  పనిచేసేందుకు  అదనపు అదికారులను నియమించాం-CS సోమేశ్ కుమార్


సూర్యాపేట జిల్లా :-  సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 83 కి చేరడంతో ప్రభుత్వం అప్రమాత్రమై  నివారణ చర్యలు తీసుకుంటున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల  మేరకు CS సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డిలు సూర్యాపేటను సందర్శించారు.
 CS సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్,  జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డిలు జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్,  కన్ టైన్ మెంట్ జోన్ లను, వాటి చుట్టు ప్రక్కల పరిసరాలను పరుశీలించారు. ఈ సందర్బంగాసీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ సూర్యాపేట లో ఇప్పటివరకు 83 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, నేరుగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని సీఎం కెసిఆర్ ఆదేశించారని తెలిపారు. దీనిపై మరింత సమర్థ వంతంగా పనిచేసేందుకు అదనపు అదికారులను నియమించామని, కంటైన్మెంట్ జోన్లలో జీరో మూవ్ మెంట్ చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు.ఆర్ అండ్ బీ వాళ్లకు తగిన సూచనలు చేశామని, ఆయా ప్రాంతాలకు కొత్తవారు ఏవరు వచ్చారనేదానిపై సర్వే చేయాలని నిర్ణయించామని అన్నారు. క్వరెంటైన్ లో ఉన్నవారికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలనే దానిపై సూచనలు చేశామని, త్వరలో కంట్రోల్ లోకి వస్తుందని మాకు నమ్మకం ఉందని అన్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారని, వాళ్లకు పూర్థిస్థాయిలో మద్ధతుగా ఉంటామని టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కొరారు. డిజిపి మహేందర్ రెడ్డి  మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు హై లెవల్ టీమ్ గా క్షేత్రస్థాయిలో సందర్శించామని, జిల్లా అధికార యంత్రాంగానికి మరింత సపోర్ట్ ను ఇవ్వడానికి వచ్చామని తెలిపారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, సూర్యాపేట జిల్లాలో కూడా మహమ్మారీని కట్టడి చేస్తామని, కంటైన్మెంట్ ఏరియాలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని తెలిపారు. పక్క పక్క ఇళ్ల వారు కూడా కాంటాక్ట్ లో ఉండకూడదని, కంటేన్మెంట్ ఏరియాలోకి బయటివారు రాకుండా.. లోపలి వారు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భవిష్యత్ లో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేలా పలు సూచనలు చేశామని, అన్నీ శాఖలకు సహాయ సహకారం అందిస్తూ పోలీస్ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. అతి త్వరలోనే జిల్లాలో వైరస్ కట్టడి అవుతుందన్న విశ్వాసం మా బృందానికి ఉందని, జిల్లా ప్రజలు లాక్ డౌన్ అమలుకు పూర్తిగా సహకరిస్తున్నారని అన్నారు. కమిషన్ ఏజంట్ కు పాజిటివ్ రావడం అతను ఎన్నో దుకాణాదారులను కాంటాక్ట్ కావడం వల్లే జిల్లాలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందని తెలిపారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్