కేసులు ఎత్తివేయాలని సీపీని కలిసిన టీయూడబ్ల్యూజే బృందం
కేసులు ఎత్తివేయాలని సీపీని కలిసిన టీయూడబ్ల్యూజే బృందం
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ లో రెండు న్యూస్ చానళ్ల ప్రతినిధులపై పై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మోతే వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధి బృదం సోమవారం రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ విలేకరులపై పెట్టిన కేసులను ఎత్తివేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ప్రచారాలు చేయవద్దని, పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ ప్రతినిధులు బాల్ రాజ్, రాయుడు, అశోక్, బాలాజీ, నరసింహా రెడ్డి, మహేష్, రవికుమార్, పవన్ , తేజ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment