మరింత పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేయండి - ఐజి స్టీఫెన్ రవీంద్ర
నల్లగొండ : రేంజ్ ఐజి స్టీఫెన్ రవీంద్ర నల్లగొండ జిల్లాలో లాక్ అమలు, పోలీసులు తీసుకున్న చర్యలను పర్యవేక్షించారు. శనివారం జిల్లాలోని చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టు పరిశీలించడంతో పాటు లాక్ డౌన్ పటిష్ట అమలుకు జిల్లాలో తీసుకుంటున్న చర్యలను ఎస్పీ రంగనాధ్ ను అడిగి తెలుసుకున్నారు. అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా పోలీసులు అన్ని రకాలుగా ప్రజలకు అండగా నిలిస్తారనే నమ్మకం, అభిమానము కలిగేలా పని చేయాలని సూచించారు.
అనంతరం ఎస్పీ మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. లాక్ డౌన్ నేపద్యంలో ప్రజలు బయటికి రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న క్రమంలో అంతర్ జిల్లా సరిహద్దు వద్ద మరింత పటిష్టంగా వ్యవహారించాలని, అత్యవసరమైతే తప్ప వాహనాలు అనుమతించవద్దని అధికారులకు సూచించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆయన వెంట ఎస్పీ రంగనాధ్, ట్రైనీ ఐపీఎస్ వైభబ్ గైక్వాడ్, సిఐ శంకర్ రెడ్డి, ఎస్.ఐ. రాజు ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Comments
Post a Comment