అక్రమ కేసును ఎత్తివేయాలి-టీయుడబ్ల్యుజె డిమాండ్
అక్రమ కేసును ఎత్తివేయాలి-టీయుడబ్ల్యుజె డిమాండ్
మేడ్చల్ జిల్లా నేరేడ్ మెట్ లో కరోనా పాజిటివ్ వార్తను ప్రసారం చేసిన రెండు న్యూస్ ఛానళ్ల ప్రతినిధులపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ లు ఖండించారు.
రాష్ట్రంలో కరోనాను నిర్మూలించేందుకు గాను ప్రభుత్వం చేస్తున్న కృషికి పూర్తి చేయూతనందిస్తూ మీడియా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోందని, కొన్ని వాస్తవాలను కొందరు అధికారులు దాచిపెట్టే ప్రయత్నాలు చేయడం సమాజానికి నష్టం చేకూర్చే విధంగా ఉండడంతో, మీడియా మాత్రం వాస్తవాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తోందని, . దీనిని జీర్ణించుకోలేకే పథకం ప్రకారం మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కే ప్రయత్నాలు చేయడం సహించారని చర్యగా భావిస్తున్నామని తెలుపారు. నేరేడ్ మెట్ లో పోలీసులు అదే పని చేసారని ఒక వ్యక్తికి కరోనా పాజిటీవ్ ఉన్న నిజాన్ని NTv, AP24 న్యూస్ ఛానెల్స్ బహిర్గతం చేసాయని. అధికార యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేసిన ఈ మీడియా సంస్థలను అభినందించాల్సింది పోయి, వారిపై ఎపిడెమిక్ యాక్ట్ తో పాటు మరికొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ విషయమై డీజీపీ వెంటనే స్పందించి అక్రమ కేసులను ఉపసంహ రించునే చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఉద్యమ రూపం తప్పదని సూచిస్తున్నామన్నారు.
Comments
Post a Comment