సంస్కారం
సంస్కారం
రాజస్థాన్ లోని సికర్ జిల్లా లోని ఒక గ్రామంలో కొంతమంది కార్మికులను ఒక పాఠశాల భవనంలో క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. ఊరక తిని కూర్చోవడంతో విసుగెత్తిపోయింది. ఆ పాఠశాల భవనానికి ఎన్నో ఏళ్ళుగా సున్నం లేదా పెయింటింగ్ చేయడం జరగలేదని ఆ క్వారంటైన్ లో ఉన్న కార్మికులకు అనిపించింది. వాళ్ళు వెంటనే ఆ గ్రామ సర్పంచ్ తో పాఠశాల భవనానికి పెయింట్ వేస్తామని ప్రస్తావన చేశారు. దాంతో ఆ సర్పంచ్ అవసరమైన వస్తువులు తెప్పించాడు. కార్మికులు తమ క్వారంటైన్ వ్యవధి ముగిసేలోగా భవనానికి పెయింట్ వేసేశారు. ఆ పని చేసినందుకు ఆ గ్రామ సర్పంచ్ , వారికి డబ్బులివ్వబోతే, మాకు ఇన్నాళ్ళూ ఉచితంగా భోజనాలు పెట్టారు. అందుకుగాను మేమూ ఏదో ఒకటి చేయాలనుకున్నాము. పాఠశాల భవనానికి పెయింట్ వేసే అవకాశం లభించింది. మాకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు.అయినా మీరు ఏమైనా ఇవ్వదలచుకుంటే మీ ఊరి ఈ పాఠశాలకే ఇవ్వండి అని , డబ్బును నిరాకరించారు.
ఇదీ సంస్కారం.
- మరోవైపు చూస్తే, దీనికి భిన్నంగా విధ్వంసకాండ, ఉన్న ప్రదేశాన్ని అసహ్యంగా మార్చుకోవడం అపరిశుభ్రంగా తయారు చేయడం, వైద్యులు, నర్సుల పట్ల అసహ్య ప్రవర్తన, నగ్న ప్రదర్శనలు చేస్తున్న కుసంస్కారులను కూడా చూస్తున్నాం.
Comments
Post a Comment