ఆర్ణబ్ గోస్వామి పై దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు
ఆర్ణబ్ గోస్వామి పై దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు.
సీనియర్ పాత్రికేయుడు, ఎడిటర్ ఆర్ణబ్ గోస్వామి పై దాడి చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(TWJF), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (IFWJ)లు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యంలో తమ భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తీకరించే జర్నలిస్టులపై దాడులు చేయడం సరైంది కాదని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, వర్కింగ్ కమిటీ సభ్యులు ఎల్గొయి ప్రభాకర్ లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులకు రాజకీయ,మతపరమైన సంస్థలు, పార్టీలతో సంబంధం లేకుండా ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తీకరించే హక్కు వుంటుందని అన్నారు. జర్నలిస్టులు వ్యక్తపరిచే అంశాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే వ్యక్తపరిచేందుకు అనేక మార్గాలున్నాయని,కానీ ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడడం సరైంది కాదని, ఇలాంటి దాడులు పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని అన్నారు. ఆర్ణబ్ గోస్వామి పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
STAY HOME - STAY SAFE
భౌతిక దూరం పాటించండి -
మాస్కులు ధరించండి
Comments
Post a Comment