పార్టీ ఆవిర్భావ వేడుకలను యిండ్లలోనే జరుపుకోవాలి-ఉమ్మడి నల్గొండ జిల్లా లీడర్, క్యాడర్ కు మంత్రి జగదీష్ రెడ్డీ
పార్టీ ఆవిర్భావ వేడుకలను యిండ్లలోనే జరుపుకోవాలి-ఉమ్మడి నల్గొండ జిల్లా లీడర్, క్యాడర్ కు మంత్రి జగదీష్ రెడ్డీ
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం వేడుకలను లీడర్, క్యాడర్ వారి వారి యిండ్లలోనే జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరి ఇండ్ల మీద వారే జెండా ఆవిష్కరించు కోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రబలడంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఈ రకంగా జరుపుకోవాలని అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారని అందుకు అనుగుణంగానే మనం జరుపుకోవాలని కోరారు. కరోనా వైరస్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ వీరోచితంగా పోరాడుతున్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో పాలు పంచుకునే లీడర్, క్యాడర్,ప్రజాప్రతినిధులు విధిగా బౌతిక దూరం పాటించాలని మంత్రి జగదీష్ రెడ్డి ఉద్బోధించారు. కరోనా మహమ్మారి పై జరుగుతున్న యుద్ధం లో జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకత ఉందని అందుకు గులాబీ శ్రేణులు సన్నద్ధం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండలో నూతనంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయంలో జరుగుతున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొంటారు. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ రోడ్ వెంట వెంకటేశ్వర కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న కార్యాలయంలో ఆయన గులాబీ జెండాను ఆవిష్కరిస్తారు.
Comments
Post a Comment