TS ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ , వీ త్రీ న్యూస్ సంయుక్త ఆధ్వర్యంలో జూనియర్ ఆర్టిస్టులకు, సినీ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ
TS ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ , వీ త్రీ న్యూస్ సంయుక్త ఆధ్వర్యంలో జూనియర్ ఆర్టిస్టులకు, సినీ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ
లాక్ డాన్ కారణంగా తెలంగాణ సినీ కార్మికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని భువనగిరి మాజీ ఎంపీ Dr బూర నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెరపై అందరికీ వినోదాన్ని పంచే సినీ కార్మికులు ఇప్పుడు చేతినిండా పని లేక తెరవెనుక దుఃఖాన్ని దిగమింగుతూ ఉన్నారన్నారు. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ , వీ త్రీ న్యూస్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ జూనియర్ ఆర్టిస్టులకు, సినీ కార్మికులకు Rice నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. (100 members )ఈ కార్యక్రమానికి భువనగిరి మాజీ ఎంపీ Dr బూర నర్సయ్య , తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ Dr ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు . ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సినీ కార్మికులకు అండగా ఉండేందుకే తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ TFCC ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికి ఈ ఛాంబర్ తోడు నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వి త్రి న్యూస్ చైర్మన్, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కార్యదర్శి Dr కాచం సత్యనారాయణ మాట్లాడుతూ సమాజం corona tho పోరాటం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో మనిషి కి మనిషి తోడుగా ఉండి మానవత్వాన్ని చాటుకోవాలి అన్నారు. అందరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్లలోనే ఉండి corona తరిమికొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక కార్యదర్శి నంగనూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment