ఔదార్యం చాటుకున్న సుంకరి మల్లేష్ గౌడ్- అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి
ఔదార్యం చాటుకున్న సుంకరి మల్లేష్ గౌడ్- అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి
కరోనా వైరస్ మీద రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న పోరాటానికి ఆర్ధికంగా మద్దతు తెలుపుతూ పలువురు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
అందులో బాగంగా సోమవారం ఉదయం నల్గొండ లోని టి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి ని కలసి లక్షా 8 వేల చెక్ ను సీనియర్ టి ఆర్ యస్ నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్ అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మరిని తరిమెందుకు చేస్తున్న ప్రయత్నాలకు తోడు మల్లేష్ గౌడ్ లాంటి నేతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆర్ధికంగా మద్దతు తెలపడం అభినంద నియమన్నారు. ఈ కార్యక్రమానికి నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మాజీ యం ఎల్ సి పూల రవిందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment