మాస్కు పెట్టుకుంటేనే పెట్రోల్
మాస్కు లేకుంటే పెట్రోల్ పోయనంటున్న డీలర్లు
పెట్రోల్ కొట్టించుకునేందుకు వెళుతున్నారా.. అయితే జేబులో డబ్బులు ఉంటే సరిపోదు.. ముఖానికి మాస్కు కూడా ఉండాలి.. అవును మాస్కు లేకుండా పెట్రోల్ బంకుకు వచ్చిన వారికి పెట్రోల్ అమ్మవద్దని డీలర్లు నిర్ణయం తీసుకున్నారు.
పెట్రోల్ పంపులు సంవత్సరం పొడవునా.. 24 గంటలూ తెరిచే ఉంటాయి. వీటిలో పనిచేసేవారు ఎల్లప్పుడూ కస్టమర్లతో ప్రత్యక్షంగా కాంటాక్ట్‌లో ఉండవలసి ఉంటుందని వారి రక్షణ కూడా మా భాద్యత అని డీలర్లు అంటున్నారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు కచ్చితంగా పాటించేందుకు కూడా ఈ నియమం ఉపయోగపడుతుంది.
మాస్కు లేకుండా ఏ కస్టమర్ వచ్చినా వారికి పెట్రోల్‌ను ఎట్టిపరిస్థితీుల్లో విక్రయించేది లేద’ని వారు తేల్చి చెప్పారు.
ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఉన్న పెట్రోల్ బంకుకు వచ్చిన ఓ కస్టమర్‌ను మాస్క్ ధరించాల్సిందిగా అక్కడి సిబ్బంది కోరారు. అంతేకాకుండా మాస్క్ లేకపోవడంతో అతడికి పెట్రోల్‌ను విక్రయించేందుకూ వారు నిరాకరించారు. దీనిని ఆ కస్టమర్ కూడా సమర్థించారు. .
Comments
Post a Comment