లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి - కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా
లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి - కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా
స్థానికంగా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు
ప్రజలంతా తప్పనిసరిగా మాస్కు ధరించాలి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయించిన రంగాల్లో జాగ్రత్తలు పాటించాలి
ఉపాధి హామీ పనులు, గ్రామీణ అభివృద్ధి పనులకు అనుమతి
వ్యవసాయాధారిత పనులు ఆటంకం కలిగించవద్దు
వలస కూలీల కనీస వసతులు కల్పించాలి
కోవిడ్ 19 వైరస్ నివారణ, పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎస్ లు,జిల్లా కలెక్టర్ లు,ఎస్.పి.లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా
నల్గొండ, ఏప్రిల్ 25: కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణ కొరకు చేపట్టిన లాక్ డౌన్ అమలు పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు,జిల్లా కలెక్టర్ లు, ఎస్. పి.లకు సూచించారు. లాక్ డౌన్ అమలు తీరు పై తీసుకుంటున్న చర్యలపై ఆయన శనివారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు,జిల్లా కలెక్టర్ లు,ఎస్.పి.లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రపంచంలోని అగ్ర రాజ్యాల సైతం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని, భారతదేశం వంటి అధిక జనాభా కలిగిన దేశం లో కోంతమేర వైరస్ వ్యాప్తి నిరోధించామంటే లాక్ డౌన్ విధించడమే కారణమని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకుల కొరత, సరఫరా చైన్ లో అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసులు నమోదు కావడం లేదని, అక్కడ కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆర్థిక కార్యక్రమాలు కొనసాగించాలని, భవిష్యత్తులో ఆహార కొరత రాకుండా వ్యవసాయ ఆధారిత పనులకు ఆటంకం కలిగించవద్దని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను హాట్ స్పాట్ గుర్తించామని, ఆ ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ మినహాయించి ఎలాంటి సడలింపులు ఉండదని ఆయన స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ కేసులువచ్చిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన కలెక్టర్లకు వివరించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజారవాణా, రవాణా సౌకర్యాలు రద్దు చేస్తున్నామని, విద్యా సంస్థలు, శిక్షణ కేంద్రాలు షాపింగ్ మాల్స్, మూసి ఉంటాయని, మత ప్రార్థనలు దైవ కార్యక్రమాలకు అనుమతి ఉండదని ఆయన పేర్కొన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, విత్తనాల, ఎరువుల తయారీ, వ్యవసాయాధారిత రంగాలకు వ్యవసాయ పరికరాలు విడిభాగాల దుకాణాలు, వ్యవసాయ యంత్రాల రవాణా ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. *గ్రామాల్లో ఉపాధిహామీ పనులు రోడ్డు ,సాగునీటి , పారిశ్రామిక ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టే సమయంలో ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ పనిలో పాల్గొనాలని ఆయన స్పష్టం చేశారు. వలస కూలీల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారికి కనీస వసతులు కల్పించాలని సూచించారు. వలస కూలీలు సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వారికి ప్రస్తుత పరిస్థితిని వివరించాలని, ముగిసేవరకు ఎక్కడి వారు అక్కడ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కరోనా పాజిటివ్ కేసులు నమోదు పరిశీలించి లాక్ డౌన్ లో సడలింపు ల పై తదుపరి నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. హాట్ స్పాట్ ప్రాంతాలను రాష్ట్ర , జిల్లా యంత్రాంగాలు ప్రకటించాలని, సదర్ ఏరియాల్లో సాధారణ మినహాయింపులు వర్తించవని తెలిపారు. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని, *బహిరంగ ప్రదేశాల్లో పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిందని, ప్రదేశాల్లో ఉమ్మితే భారిగా జరిమానా విధించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తప్పనిసరిగా మినహాయింపు పొందిన వారు పాటించాలని ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,ఎస్.పి.ఏ.వి.రంగ నాథ్, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ రాహుల్ శర్మలు పాల్గొన్నారు
Comments
Post a Comment