**ఆంగ్ల మాధ్యమంపై ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు**

ఆంగ్ల మాధ్యమంపై ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు


ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81,85ను రద్దు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ భాజపా నాయకుడు సుదీష్‌ రాంబొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్లు వేశారు.  ఏ మాధ్యమంలో చదవాలన్న అంశం విద్యార్థుల నిర్ణయానికే వదిలివేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేయడం సరికాదని పేర్కొన్నారు. మరోవైపు ఆంగ్లమాధ్యమం విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచి ఈరోజు వెలువరించింది. జీవోలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్