సూర్యాపేటపై దృష్టిసారించండి- అధికారులకు జగదీశ్‌రెడ్డి ఆదేశాలు
సూర్యాపేటపై దృష్టిసారించండి- అధికారులకు జగదీశ్‌రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్: కనా కల్లోలంతో తల్లడిల్లుతున్న సూర్యపేట పట్ణణంలో పరిస్థితి పై అధికారులు దృష్టిసారించాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిఅధికారులను ఆదేశించారు. ఇక్కడి పరిస్థితులను దారిలో పెట్టేందుకు అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పరిస్థితి ఉగ్రరూపం దాలుస్తుండడంతో గురు, శుక్రవారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం హైదరాబాద్ నుంచే పరిస్థితులను మానిటరింగ్‌చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదేశంతో రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం ఉపశమన చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే శనివారం ఉదయం నుంచి రెడ్‌జోన్ ఏరియాలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌లు విస్తృతంగా పర్యటించారు.
పట్టణ ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలపై మున్సిపాలిటీ దృష్టి సారించింది. అదే విధంగా మొట్టమొదటి సారిగా చివ్వేంట మండలం బీబీగూడెంలో కరోనా పాజటివ్ కేసు వెలుగు చేసిన నేపధ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది. ఆ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి పాజిటివ్ కేసు బాధితుడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నవారి వివరాలను సేకరించింది. దానికితోడు గురు, శుక్రవారాల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశాలకు కొనసాగింపుగా శనివారం కూడా పట్టణంలో అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపారు. అగ్నిమాపక యంత్రాలతో రెడ్‌జోన్ ఏరియాల్లో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ర్పే చేయించారు.
Comments
Post a Comment