ఓ జర్నలిస్టు  ఆవేదన

ఓ జర్నలిస్టు  ఆవేదన


అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే మనం గొప్పగా చూపిస్తాం
కానిస్టేబుల్ చిన్న సహాయం చేసిన గొప్పగా చిత్రీకరించి చూపిస్తాం
పోలీస్ కన్నా నిజమైన హీరో ఎవరులేరని ప్రజలమదిలో గుర్తుండిపోయేలా కథనాలు వేస్తాం
ప్రతి దృశ్యం వాళ్ళని ఉన్నతులుగా చూపించే ప్రయత్నం చేస్తాం


ఎన్నోసార్లు వాళ్ళు ఫోన్ చేసి మేము ఈ పని చేసాం కాస్త మాకు పబ్లిసిటి ఇవ్వండి అని విన్నవిస్తే మనవాళ్లే కదా అని పరిధికి మించి సహాయాం చేస్తాం...


వాళ్లకు నచ్చని న్యూస్ స్క్రోలింగ్ వస్తే కేవలం ఫోన్ చేసి చెబితే మన వృత్తి ధర్మాన్ని పక్కనబెట్టి సహకరిస్తాం


ఎన్ని ఘటనలు ఎన్ని తప్పులు....అయినా ప్రజల శ్రేయస్సు అధికారుల పట్ల గౌరవంతో రాజి పడతాం...


ఒక చిన్న స్క్రోలింగ్ ని ఆసరా చేసుకుని రిపోర్టర్ మీద కేసు పెడతారా?


ఒక పోలీస్ ఫిర్యాదు చేయడమేంటి ? దాని ఆధారంగా అదే పోలీసుస్టేషన్ అధికారి కేసు ఫైల్ చేయడమేంటి?


ఎందుకింత డ్రామా?
 కమిషనేర్ కి తెలియకుండా నే ఇదంతా జరిగిందా?


స్క్రోలింగ్ తప్పు అయితే ఫోన్ చేసి చెబితే మార్చేవారు కదా? చేసారా...?


రోజుకి పదులసంఖ్యలో మెసేజిలు ఫోటోలు వీడియోలు మీరు పంపిస్తే మీరు కేసు పెట్టిన రిపోర్టర్ కూడా వాళ్ళ ఛానల్ లో వేస్తున్నాడు కదా..!!


ఇది తప్పుడు స్క్రోలింగ్ అని ఒక మెసేజ్ వేస్తే సరిపోయేది కదా..! వేసారా?


న్యూస్ చానెల్స్ కి ప్రభుత్వ అనుమతి ఉంది...అందులో పనిచేసే పూర్తిస్థాయి రిపోర్టర్(స్టఫర్) మీకు నచ్చని స్క్రోలింగ్ వేస్తే ఛానల్ పై కేసు పెడతారా? రిపోర్టర్ పై కేసు పెడతారా?


ఇదంతా ఒక పథకం ప్రకారం చేసినట్లు కనిపిస్తోంది.


రూల్ ప్రకారం ఇలానే చేస్తాం అంటే మేము కూడ మా వృత్తి ధర్మాన్ని కచ్చితంగా పాటిస్తాం...!!


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్