ఉప్పల ఫౌండేషన్ భోజన వితరణ మలక్ పెట్,  అల్కపురి, చైతన్య పురి, కొత్తపేట,  సీతాఫల్ మండిల లో


ఉప్పల ఫౌండేషన్ భోజన వితరణ మాలక్ పెట్, 
అల్కపురి, చైతన్య పురి, కొత్తపేట,  సీతాఫల్ మండిల లో


టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ఉప్పల ఫౌండేషన్ తరపున లాక్ డౌన్ విధించిన నాటినుండి ప్రతీరోజూ ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈక్రమంలో ఇవాళ మలక్ పేట గంజ్ హైదరాబాద్ మార్కెట్ లో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చీదర రాధగారి కోరిక మేరకు హమాలీలకు, డ్రైవర్లు, క్లీనర్లు శానిటర సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి భోజనం ఏర్పాటు చేసారు. అలాగే అల్కపురి, చైతన్య పురి, కొత్తపేట, సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి ప్రాంతాల్లో గల వలస కార్మికులకు, జీహెచ్ఎంసీ పరిధిలోని కూలీలకు, విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, జీహెచ్ఎంసీ సిబ్బందికి, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భోజనాన్ని అందించారు. ముఖ్యంగా నా అనేవారు లేని అభాగ్యులకు, తల్లితండ్రిలేక అనాధాశ్రమాల్లో ఉంటున్న చిన్న బిడ్డలకు వయసు పైబడి ఓల్డేజ్ హోంలలో ఉంటున్న పెద్దవారికి ఉప్పల ఫౌండేషన్ తరపున ఆకలి తీర్చుతున్నారు. లాక్ డౌన్ ముగిసేవరకూ వనస్థలిపురంలోని కరుణ జ్యోతి ట్రస్ట్ కు, నాగోల్ లోని వాత్సల్యం ఆర్గనైజేషన్ కు, మనుసురాబాద్ లోని సద్గురు ఓల్డేజ్ హోంలకు ఆహారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో హైదరాబాద్ మార్కెట్ కమిటీ సెక్రటరీ, డైరక్టర్లు, ఐవీఎఫ్ నాయకులు జిన్నం వేణు, ఎల్వీ కుమార్, అనిల్ ప్రసాద్, ఐవీఎఫ్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయ సహకారాలు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుమేరకు లాక్ డౌన్ విధించిననాటినుండి తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని, మూడవ తేదీన లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రజలు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పరిశరాలు శుభ్రంగా ఉంచుకుంటూ ప్రభుత్వం చెప్పే సూచనలు పాటించాలని కోరారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా వృద్ధులు, చిన్న పిల్లల ఆకలి తీర్చినపుడు కలిగే ఆత్మ సంతృప్తి గొప్ప అనుభూతినిస్తుందన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్