అనవసరంగా బయటికి వస్తే చర్యలు తప్పవు : ఎస్పీ రంగనాధ్
అనవసరంగా బయటికి వస్తే చర్యలు తప్పవు : ఎస్పీ రంగనాధ్
నల్లగొండ, మిర్యాలగూడ రెడ్ జోన్లు, దామరచర్ల రిలీఫ్ క్యాంపు పరిశీలించిన ఎస్పీ
లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశం
నల్లగొండ : కరోనా బారి నుండి ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని, అనవసరంగా బయటికి వస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ హెచ్చరించారు.
బుధవారం ఆయన నల్లగొండ పట్టణంతో పాటు మిర్యాలగూడ ప్రాంతాలలో రెడ్ జోన్లతో పాటు దామరచర్లలోని రిలీఫ్ క్యాంపును పరిశీలించారు. రిలీఫ్ క్యాంపులో ఏర్పాటు చేస్తున్న భోజనాన్ని ఆయన పరిశీలించి వారితో మాట్లాడారు. కరోనా వైరస్ పెరిగిపోతున్న మే 7వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని, అందువల్ల ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లాలని, అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని సూచించారు. లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటిష్టంగా చర్యలు తీసుకుంటూ జిల్లాలో కోవిడ్ - 19 కేసులు పెరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఆయన వెంట స్థానిక పోలీస్ అధికారులు నిగిడాల సురేష్, రమేష్ బాబు తదితరులున్నారు.
Comments
Post a Comment