ఢిల్లీలో దారుణం.. అత్త, మామలను కడతేర్చిన కోడలు

ఢిల్లీలో దారుణం.. అత్త, మామలను కడతేర్చిన కోడలు



కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో దేశ రాజధానిలో దారుణం జరిగింది. భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండగానే అత్తా, మామలను అత్యంత కిరాతకంగా@@
కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో దేశ రాజధానిలో దారుణం జరిగింది. భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండగానే అత్తా, మామలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కోడలు ఉదంతం వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీ చావ్లా ప్రాంతంలోని దుర్గా విహార్‌ ఫేజ్‌-2లోని తమ ఇంటిలో కవిత (35) అనే మహిళ తన అత్తమామలు రాజ్‌ సింగ్‌(61), ఓంవతి (58)లను దారుణంగా కొట్టి ఆపై కసితీరా కత్తితో పొడిచి చంపిందని పోలీసులు వెల్లడించారు.
కాగా.. ఈ రోజు ఉదయం 11 గంటలకు హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె భర్త సతీష్‌ సింగ్‌ (37)నూ ఈ కేసులో నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. జంట హత్యల కేసులో కవిత, ఆమె భర్తను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్