తిరుమలలో ఎలుగుబంట్ల సంచారం


తిరుమలలో ఎలుగుబంట్ల సంచారం


శ్రీవారి సన్నిధిలో భయం..భయం


 


తిరుమలేశుని సన్నిధిలో క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. 



కొన్ని రోజుల క్రితం శ్రీవారి సన్నిధి ఆనందనిలయం చెంత అడవి పందులు సంచారం చేయగా తాజాగా తిరుమల రోడ్లపై ఎలుగు బంట్లు యధేచ్ఛగా తిరిగాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తిరుమలేశుని సన్నిధిలో క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం శ్రీవారి సన్నిధి ఆనందనిలయం చెంత అడవి పందులు సంచారం చేయగా తాజాగా తిరుమల రోడ్లపై ఎలుగు బంట్లు యధేచ్ఛగా తిరిగాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాన రోడ్లకు అడ్డంగా ఎలుగు బంట్ల సంచరిస్తుండడం గమనించిన కొందరు ఈ వీడియోలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు లు చక్కర్లు కొడుతున్నాయి.



ప్రతి నిత్యం వేలాది మంది భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల రోడ్లన్నీ ఇపుడు నిర్మానుష్యంగా మారాయి. కొండమీద నివాసముండే వారికి సైతం లాక్ డౌన్ ఆంక్షలు వుండడంతో రోడ్లమీద జన సంచారం లేకుండా పోయింది. ఈక్రమంలో సమీపంలోని చిట్టడవుల నుంచి కొన్ని జంతువులు తిరుమల వీథులకు యధేచ్ఛగా వచ్చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆనందనిలయం ముందుకు పందులు రాగా. తాజాగా  తిరుమల రోడ్లపై ఎలుగు బంట్లు సంచారం చేశాయి. పాములు, ఇతర చిన్న చిన్ని జంతువుల సంచారం షరామామూలుగా మారిందని తిరుమలపై నివాసముండే వారు చెప్పుకుంటున్నారు. క్రమేపీ క్రూర జంతువుల రాక మొదలైన నేపథ్యంలో తిరుమల కొండ మీద వుండే ప్రజల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్