జర్నలిస్టులకు సరుకులు అందించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను
జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా జర్నలిస్ట్ కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇటువంటి సమయంలో వారికి ఆసరాగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను భావించారు. ఈ సందర్భంగా శనివారం జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో గల ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, 1 లీటర్ నూనె, 1 కేజీ బొంబాయి రవ్వ, 1 కేజీ ఇడ్లి రవ్వ, 1 కేజీ పల్లీలు, 1 కేజీ సెమియా, 1/2 కేజీ బెల్లం, 1కేజీ ఉప్పు, 1/2 కేజీ చింతపండు, పసుపు, కారం, మినపప్పు, సంతూరు, XXX సబ్బులు, వెల్లుల్లి, తాలింపు గింజలు, టీ పోడి లను ఆయన అందజేశారు.
Comments
Post a Comment