సమాజ సేవలో నల్గొండ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా
నల్గొండ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు రక్త దానం నిర్వహించడం జరిగింది.
లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో రక్త కొరత ఏర్పడటంతో రక్తదాతలు ముందుకు రావాలని ప్రభుత్వం కోరుతోంది.
ఇందుకు సంబంధించి నల్లగొండ జర్నలిస్టులు, కెమెరామెన్ లు తమవంతు బాధ్యతగా రక్తదానం చేశారు....
సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంలో కూడా ముందుండే జర్నలిస్టులు రక్తదానం చేయడం మరి కొందరికి ఆదర్శం కావాలని... యువజన సంఘాలు, స్వచ్ఛంద రక్త దాతలు ముందుకు రావాలని జర్నలిస్టులు కోరుతున్నారు...
Comments
Post a Comment