మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్
మిషన్ భగీరథ కింద చేపట్టిన ఇంట్రా పనులు వేగవంతం చేసి త్వరితంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మిషన్ భగీరథ కింద బల్క్ వాటర్ సరఫరా, ఇంట్రా పనులు నియోజక వర్గం వారిగా పెండింగ్ పనుల పై మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారుల తో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా రక్షిత త్రాగు నీరు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన మెయిన్ గ్రిడ్ నుండి బల్క్ వాటర్ సరఫరా కు పెండింగ్ లో నున్న ఇన్ లెట్ కనెక్షన్ లు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.జిల్లాలో మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ పనులు కింద 1534 ఓ.హెచ్ ఎస్.ఆర్ లకు గాను 1494 పూర్తి చేసినట్లు,40 పెండింగ్ లో నున్నట్లు మిషన్ భగీరథ అధికారులు వివరించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ ఓ.హెచ్.ఎస్.ఆర్.లు పూర్తి చేసి కనెక్షన్ లు ఇవ్వాలని అన్నారు.ఇప్పటి వరకు 4275.82 కి.మీ. లకు గాను 4119కి.మీ. పైపు లైన్ వేయడం జరిగిందని, పెండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలో 355339 ఇంటింటి నల్లా కనెక్షన్ లకు గాను 330719 నల్లా కనెక్షన్ లు పూర్తి చేసినట్లు,పెండింగ్ 24 620 నల్లా కనెక్షన్ లు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇసుక సరవురా కొరత ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని,వెంటనే సరఫరాకు చర్యలు తీసుకుంటానని అన్నారు.అన్ని ఆవాస ప్రాంతాలకు బల్క్ వాటర్, ఓ.హెచ్.ఎస్.ఆర్ లు కమిషనింగ్, నల్లా కనెక్షన్ లు పూర్తి చేయాలని అన్నారు.ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్.ఈ లు లలిత,కృష్ణయ్య లు,ఈ ఈ మోహన్ రెడ్డి లు పాల్గొన్నారు.
Comments
Post a Comment